TSRTC: మీరు ఎక్కాల్సిన బస్సు ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు.. బస్‌ ట్రాకింగ్ యాప్‌ తీసుకొచ్చిన తెలంగాణ ఆర్టీసీ..

TSRTC: 'కూకట్‌పల్లిలో ఉండే రాజీవ్‌.. సత్తుపల్లికి వెళ్లేందుకు బస్‌ బుక్‌ చేసుకున్నాడు. తాను వెళ్లాల్సిన బస్సు బీహెచ్‌ఈఎల్‌ నుంచి మొదలవుతుంది. అయితే ఆ బస్సు కూకట్‌పల్లి బస్‌ స్టాప్‌కు ఏ సమయానికి...

TSRTC: మీరు ఎక్కాల్సిన బస్సు ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు.. బస్‌ ట్రాకింగ్ యాప్‌ తీసుకొచ్చిన తెలంగాణ ఆర్టీసీ..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 27, 2022 | 11:40 AM

TSRTC: ‘కూకట్‌పల్లిలో ఉండే రాజీవ్‌.. సత్తుపల్లికి వెళ్లేందుకు బస్‌ బుక్‌ చేసుకున్నాడు. తాను వెళ్లాల్సిన బస్సు బీహెచ్‌ఈఎల్‌ నుంచి మొదలవుతుంది. అయితే ఆ బస్సు కూకట్‌పల్లి బస్‌ స్టాప్‌కు ఏ సమయానికి చేరుకుంటుందో తెలియక గంట ముందే వచ్చి నిల్చున్నాడు. దీంతో బస్సు కాస్త గంటన్నర ఆలస్యంగా రావడంతో అంతసేపు ఎదురు చూడాల్సి వచ్చింది’. రాజీవ్‌ ఎదుర్కొన్న సమస్యను మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే టీఎస్‌ఆర్టీసీ సరికొత్త నిర్ణయం తీసుకుంది.

దీంతో మీరు ఎక్కాల్సిన బస్సు ఎక్కడుంది, మీరున్న ప్రదేశానికి ఎప్పుడు వస్తుంది లాంటి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు కేవలం కొన్ని ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న బస్‌ ట్రాకింగ్‌ను టీఎస్‌ఆర్టీసీలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ‘టీఎస్‌ఆర్టీసీ బస్‌ ట్రాకింగ్‌’ పేరిట ఆర్టీసీ అధికారులు ప్రత్యేక యాప్‌ను తయారు చేశారు. ఈ యాప్‌ను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ మంగళవారం ఆవిష్కరించారు. తెలంగాణ వ్యాప్తంగా 96 డిపోల పరిధిలో సెలక్ట్ చేసిన 4,170 బస్సులను ఈ యాప్‌తో లింక్‌ చేయనున్నారు. ఈ ప్రక్రియను దశలవారీగా అమలు చేయనున్నారు.

నగరం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి నడిచే వాటితో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఈ యాప్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం శ్రీశైలం, విజయవాడ, ఏలూరు, భద్రాచలం, విశాఖపట్నంకు వెళ్లే బస్సుల సమాచారం యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల్లో తిరిగే తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సుల వివరాలను కూడా ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌ లేదా ‌www.tsrtc.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..