Monkeypox: తెలంగాణలో మరో అనుమానిత మంకీపాక్స్ కేసు.. ఆస్పత్రికి తరలింపు..!
Monkeypox: అందరిని భయాందోళనకు గురి చేసిన కరోనా.. ప్రస్తుతం అదుపులో ఉంది. కరోనా నుంచి కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి మరింతగా ఆందోళనకు గురి చేసింది. ఇక తాజాగా..
Monkeypox: అందరిని భయాందోళనకు గురి చేసిన కరోనా.. ప్రస్తుతం అదుపులో ఉంది. కరోనా నుంచి కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి మరింతగా ఆందోళనకు గురి చేసింది. ఇక తాజాగా మంకీపాక్స్ వైరస్‌తో ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే దేశంలో నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. అందులో కేరళలో మూడు, తెలంగాణలో ఒకటి నిర్ధారణ కాగా, ఇప్పుడు మరో మంకీపాక్స్ తెలంగాణ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. గత రెండు రోజుల కిందట కామారెడ్డి జిల్లాలో ఒక మంకీపాక్స్ కేసు నమోదు కాగా, ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మంకీపాక్స్ లక్షణాలతో ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనుమానితుడి నుంచి రక్త నమూనాలను సేకరించి బుధవారం పూణేలోని ఎన్‌ఐవికి పంపించారు. ఇక కామారెడ్డి జిల్లాలో ఈ మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు కనిపించిన వ్యక్తి నమూనాలలో నెగిటివ్ తేలినట్లు తెలంగాణ ఆరోగ్యశాఖ ఉ్నతాధికారులు తెలిపారు.
ఈయన జూలై 6న కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చాడు. జూలై 20న అతనికి జ్వరం రావడంతో పాటు శరీరంపై దద్దుర్లు కనిపించాయి. దీంతో ఆయనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు మంకీపాక్స్‌గా భావించి కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతన్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఫివర్ ఆస్పత్రికి తరలించి ప్రత్యేక ఐసోలలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందించారు. ఇలా మంకీపాక్స్ కేసులు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుండటంతో కేంద్రం కట్టదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ వైరస్ వల్ల ఎలాంటి భయాందోళనలు చెందవద్దని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకేపాల్ తెలిపారు. ఈ వైరస్ వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏవైనా అనుమానాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి