AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Water Supply: హైదరాబాద్ వాసులకు గమనిక.. రేపు పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం

Hyderabad Water Supply Alert: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఆ ప్రాంతాలు ఏవంటే..?

Hyderabad Water Supply: హైదరాబాద్ వాసులకు గమనిక.. రేపు పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం
Hyderabad Water Supply
Janardhan Veluru
|

Updated on: Aug 03, 2021 | 5:17 PM

Share

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం(ఆగస్టు 4న) మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఆ మేరకు హైదరాబాద్ జలమండలి ఓ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్  మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-2 రింగ్ మెయిన్-2 నాగోల్ జంక్షన్ వద్ద ఆటో టాక్ నుండి చర్బుజా మార్బుల్స్ వరకు ఉన్న 1600 ఎంఎం డయా ఎమ్ఎస్ మెయిన్ పైపులైన్ కు జంక్షన్ పనులు చేపడుతున్నారు.  బుధవారం(04.08.2021) ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు  గురువారం (05.08.2021) ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి.  ఈ పనుల జరిగే 24 గంటల పాటు కింద ఇవ్వబడిన రిజర్వాయర్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

1. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 2 – బాలాపూర్, మైసారం, బార్కాస్. 2. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 5 – మేకలమండి, భోలక్ పూర్. 3. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం.7 – తార్నాక, లాలాపేట్, భౌద్ధ నగర్, మారెడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎమ్ఈఎస్, కంటోన్మెంట్, ప్రకాష్ నగర్, పాటిగడ్డ. 4. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 9 – హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్. 5. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 10 – వైశాలినగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతినగర్. 6. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 13 – మహింద్ర హిల్స్. 7.ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 14 – ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కానగర్, బీరప్పగడ్డ. 8. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 19 – బోడుప్పల్ లోని కొన్ని ప్రాంతాలు. 9. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 20 – మీర్ పేట్, బడంగ్ పేట్, శంషాబాద్.

నీటి సరఫరాలో అంతరాయం కలిగే ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని హైదరాబాద్ జలమండలి అధికారులు విజ్ఞప్తి చేశారు.

Also Read..

Mosquito Control: మలేరియా దోమలపై బ్రహ్మాస్త్రం..ఇది ప్రయోగిస్తే దోమలు పరార్!

Railways News: త్వరలోనే ప్రైవేటు రైళ్ల కూత.. ప్రైవేటు భాగస్వామ్యంపై కీలక చర్చలు

డీప్ ఫ్రైకి వాడిన నూనె మళ్లీ ఉపయోగిస్తే.. ఏ రోగాలు వస్తాయో తెలుసా
డీప్ ఫ్రైకి వాడిన నూనె మళ్లీ ఉపయోగిస్తే.. ఏ రోగాలు వస్తాయో తెలుసా
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్