Railways News: త్వరలోనే ప్రైవేటు రైళ్ల కూత.. ప్రైవేటు భాగస్వామ్యంపై కీలక చర్చలు
దేశంలో ప్రైవేట్ రైళ్లను నడిపే దిశగా చర్యలు ఊపందుకున్నాయి. 2023 నాటికి మొదటి దశ రైళ్లను పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తోంది రైల్వేశాఖ. ఇప్పుడు తాజాగా BHELతో కలిసి కొన్ని రైళ్లను నడించాలని IRCTC...
దేశంలో ప్రైవేట్ రైళ్లను నడిపే దిశగా చర్యలు ఊపందుకున్నాయి. 2023 నాటికి మొదటి దశ రైళ్లను పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తోంది రైల్వేశాఖ. దాదాపు 151 రైళ్ల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించి.. తద్వారా 30వేల కోట్ల పెట్టుబడులు రాబట్టాలని నిర్ణయించింది రైల్వేశాఖ. దీనివల్ల సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆదాయాలు, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అంచనావేస్తోంది. ఫస్ట్ ఫేజ్‌లో 12 ప్రైవేట్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇలా 2027 నాటికి మొత్తం 109 రూట్లలో 151 ప్రైవేట్ రైళ్లు.. ప్రయాణికులకు సేవలందించనున్నాయి. ఈ ప్రైవేట్ రైళ్ల ద్వారా ఇండియన్ రైల్వేస్‌కు ఏటా రూ.3 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఐఆర్‌సీటీసీ కూడా బీహెచ్ఈఎల్‌తో కలిసి కొన్ని రైళ్లను నడించాలని ప్లాన్ చేసింది.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC), భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (BHEL) ప్రైవేట్ రైళ్లను నడపడానికి భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతున్నాయి. IRCTC వేలం వేసిన రూట్లలో ప్యాసింజర్ రైళ్లను నడపడానికి ప్రభుత్వ సంస్థలు ప్రత్యేక ప్రయోజన వాహనాన్ని (SPV) ఏర్పాటు చేయవచ్చు.
“అయితే, BHEL ప్రైవేట్ రైలు సేవకు అవసరమైన డబ్బును పెడుతుంది. IRCTC కార్యాచరణ అవసరాలపై దృష్టి పెట్టబోతోంది”అని ఒక అధికారి ఓ మీడియాకు తెలిపింది. జూలై 23 న, రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణీకుల రైలు కార్యకలాపాల ప్రాజెక్ట్‌లో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యానికి (PPP) బిడ్‌లను ప్రారంభించింది. 7,200 కోట్ల పెట్టుబడితో 29 జతల రైళ్లను నడపడానికి ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల నుండి బిడ్లను స్వీకరించినట్లు మంత్రిత్వ శాఖ ఇప్పటికే తెలిపింది.
“రైల్వే మంత్రిత్వ శాఖ ప్రైవేట్ , ప్రభుత్వ రంగాల నుండి 29 జతల రైళ్లను నడపడానికి బిడ్లను స్వీకరించింది. దాదాపు 40 రూ. రూ. 7200 కోట్ల పెట్టుబడిని కలిగి ఉంది. రైల్వే మంత్రిత్వ శాఖ త్వరితగతిన మూల్యాంకనాన్ని పూర్తి చేసి బిడ్లను నిర్ణయిస్తుంది,” అధికారిక ప్రకటనలో తెలిపింది.
మంత్రిత్వ శాఖ 12 క్లస్టర్‌లను అందించింది. కానీ మూడు బిడ్‌లను మాత్రమే అందుకుందని బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది. ఈ రైళ్లను 12 క్లస్టర్లుగా విభజిస్తారు. ఢిల్లీ, ముంబైలో రెండు క్లస్టర్లు.. సికింద్రాబాద్, చెన్నై, హౌరా, జైపూర్, ప్రయాగ్‌రాజ్, చండీగఢ్, బెంగళూరు, పాట్నాల్లో ఒక్కో క్లస్టర్ ఏర్పాటుచేస్తారు. ఇక ఈ ప్రైవేట్ ట్రైన్స్ రూపకల్పనలో పలు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోనుంది రైల్వేశాఖ.
ఈ కొత్త రైళ్లలో 70 శాతం దేశీయంగానే తయారయ్యేలా కంపెనీలకు నిబంధన విధించనున్నారు. అలాగే గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ రైళ్లను డిజైన్ చేయనున్నారు. తొలినాళ్లలో 130 కిలోమీటర్ల వేగంతో నడిపి..తర్వాత 160కిలోమీటర్ల వేగంతో నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిద్వారా ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు కృషి చేస్తోంది రైల్వేశాఖ.
ఇక సమయపాలన విషయంలో కచ్చితత్వం, సేవల్లో నాణ్యత తదితర నిబంధనల ద్వారా ప్రైవేట్ సంస్థలకు రైళ్ల నిర్వహణకు అనుమతి ఇవ్వనున్నారు. ఏ అంశంలోనైనా విఫలమైతే ఫెనాల్టీ విధించేలా..అనుమతిచ్చేటప్పుడే ఆయా అంశాలకు సంబంధించి ఒప్పందాలు చేసుకోనుంది ఇండియన్ రైల్వే.
ఇవి కూడా చదవండి: Price is more Than Gold: మీకు ఈ సంగతి తెలుసా.. ఈ పక్షి ఈకలు బంగారం ధర కంటే ఎక్కువ..