Telangana: దడ పుట్టిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు.. వారి నిర్లక్ష్యం ప్రాణాలనే తీసేస్తున్నాయి..!

Telangana: దడ పుట్టిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు.. వారి నిర్లక్ష్యం ప్రాణాలనే తీసేస్తున్నాయి..!
Fire Safety

Telangana: ప్రభుత్వ కార్యాలయాలు దడపుట్టిస్తున్నాయి. ఏ చిన్న ఫైర్ జరిగినా.. ప్రాణాలు తీసేలా కన్పిస్తున్నాయి. నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగిన గవర్నెమెంట్..

Shiva Prajapati

|

Apr 12, 2022 | 5:59 AM

Telangana: ప్రభుత్వ కార్యాలయాలు దడపుట్టిస్తున్నాయి. ఏ చిన్న ఫైర్ జరిగినా.. ప్రాణాలు తీసేలా కన్పిస్తున్నాయి. నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగిన గవర్నెమెంట్ ఆఫీసుల్లో మచ్చుకైనా ఫైర్ సేప్టీ కనిపించడంలేదు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, పోలీసు.. చివరికి ఫైర్ స్టేషన్లలో కూడా ఫైర్ సేఫ్టీమెజర్స్ కనిపించకపోవడం భయాన్ని కల్గిస్తోంది. భయాందోళనలు కల్గిస్తున్న సర్కారు కార్యాలయాల్లో ఉన్న నిర్లక్ష్యాన్ని టివి9 నిఘా టీమ్ బట్టబయటలు చేసింది.

గత ప్రమాదాల నేపథ్యంలో.. అగ్రిప్రమాదాలు కేవలం ఆస్థినష్టాన్నే కాదు.. ప్రాణాలు తీసేస్తున్నాయి. సికింద్రాబాద్ బోయిగూడలో గతంలో జరిగిన ప్రమాదం పదుల సంఖ్యలో ప్రాణాలు తీసింది. సజీవంగా దహనం చేసింది. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదం దహించివేసింది. అందుకే.. వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, అపార్టుమెంట్లు, అగ్నిమాపక నిబంధనలు పాటించకపోతే నిర్మాణాలకు క్లియరెన్స్ ఇవ్వడంలేదు. ఇలాంటి నిర్మాణాలకు ఫైర్ డిపార్టెమెంట్ నుంచి నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్ ఉండాల్సిందే. గృహాలు.. జనాలతో సంబంధం ఉన్న ప్రైవేటు సంస్థల్లో సైతం ఫైర్ ఎక్విప్‌మెంట్ ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే, ఏదైనా ప్రమాదం జరిగితే అగ్నిమాపక శాఖ, మరోవైపు పోలీసు డిపార్టెమెంట్ కేసులు నమోదుచేస్తున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ లలో ఫైర్ సేఫ్టీ తనిఖీలకోసం డిజాస్టర్ డిపార్టుమెంట్‌లో ప్రత్యేక విభాగమే ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ సంస్థల సంగతేంటి? మరి ప్రభుత్వ సంస్థల సంగతేంటి? నిత్యం అనేక డిపార్టుమెంట్లకు ప్రజలకు వెళుతున్నారు. రెవెన్యూ, సబ్‌ రిజిస్ట్రేషన్‌, పోలీసు, జిహెచ్ఎంసీ వంటి కార్యాలయాలు నిత్యం ప్రజాసంబంధాలు కలిగి ఉంటున్నాయి. ఇక్కడ ఉండే సిబ్బంది.. అక్కడకు వచ్చే ప్రజలు.. ఎవ్వరికీ ఏ చిన్న ప్రమాదం జరిగినా వెంటే మంటలు ఆర్పే పరికరాలు కనిపించడంలేదు. ఇవన్నీ కూడా ఫైర్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏదో రూపంలో చర్యలు తీసుకునే విభాగాలే. కానీ ఇక్కడ మాత్రం రూల్స్ పాటించడంలేదు.

కాగా, ఫైర్‌ నిబంధనలు పాటించని డిపార్టెమెంట్లు ఎక్కడెక్కడున్నాయి? అక్కడ ఎలాంటి ఉల్లంఘనలు సాగుతున్నాయి అనే దానిపై టివి9 నిఘా టీమ్ పరిశోధన సాగించింది. ఈ పరిశోధనలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడుతున్నాయి. ఎంత నిర్లక్ష్యం కొనసాగుతోందో కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ఏ చిన్న ప్రమాదం జరిగినా అంతే సంగతులు. నిత్యం జనంతో కిటకిటలాడే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 50 శాతం ఆఫీసులకు నో ఫైర్‌ సేఫ్టీ అని తేల్చి చెప్పొచ్చు.

కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం.. కూకట్‌పల్లి లోని సబ్ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం. నాలుగంతస్తుల బహుళ భవనం. నిత్యం భూ లావాదేవీల కోసం.. కిటకిటలాడే జనం. మరో వైపు.. అంతా ఇరుకైన ప్రాంతం. ఇక్కడ ఏదైనా ఫైర్ జరిగితే.. అంతే సంగతులు. ఇక్కడ సీసీ కెమారాలు ఉంటాయి. కరోనా నిబంధనలు ఖచ్చితం అంటారు. కానీ.. జనంతో కిటకిట లాడే ఈ కార్యాలయంలో మచ్చుకైనా ఫైర్ నిబంధనలు కనిపించవు. ఈ కార్యాలయ భవనంలోనే అనేక కార్యాలయాలు ఉన్నాయి. ఇలాంటి చోట ఏదైనా జరిగితే.. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు.. కంప్యూటర్లలో నిక్షిప్తం అయిన సమాచారం ఏంకావాలి?. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడకు వచ్చే అధిక సంఖ్యలోని జనం సంగతేంటి? ఊహించుకుంటేనే ఆందోళన భయం కలుగుతుంది.

పోలీస్ స్టేషన్లలోనే నో ఫైర్ సెఫ్టీ.. ఇక పోలీసు స్టేషన్ల విషయానికి వద్దాం. పోలీస్ స్టేషన్లు.. ఆధునిక దేవాలయాలు. తెలంగాణలో ప్రభుత్వం నిధులు కేటాయించి అనేక పోలీసు స్టేషన్లను అభివృద్ధి చేసింది. మరి ఈ రక్షక భట కార్యాలయాల్లో చాలా వాటికి నో ఫైర్‌ సేఫ్టీ అంటే.. ఇక రక్షణ ఎక్కడుందీ అనుకోవాల్సిందే.

ఎస్‌ఆర్‌ నగర్ లోని పాత పోలీసు స్టేషన్‌‌లో అసౌకర్యాలకు చెక్ చెబుతూ.. అధునాతన సౌకర్యాలతో అతిపెద్ద బహుళ అంతస్తుల భవనం నిర్మాణం చేశారు. ఈ పోలీసు స్టేషన్‌‌లో అన్ని విభాగాలకు ప్రత్యేక అంతస్థులు. విశాలమైన గదులు, స్టేషన్‌ వచ్చే వారి కోసం కూర్చీు, మంచినీరు, పార్కింగ్ ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మరోవైపు ఒక కార్పొరేట్ కార్యాలయాన్ని తలపించేలా పచ్చదనాన్ని ఏర్పాటుచేశారు. ఇన్ని చేశారు కానీ ఫైర్ నిబంధనల ప్రకారం ఈ బహుళ అంతస్థుల పోలీసు స్టేషన్‌‌కు ఫైర్ సేఫ్టీ మరిచారు. ఇంత పెద్ద భవనానికి ఫైర్ సేఫ్టీలో భాగంగా వాటర్ పైప్ లైన్ ఉండాలి. అన్ని గదుల్లోనూ ఫైర్ ఎక్విప్‌మెంట్ ఉండాలి. కానీ కనీసం ఫైర్ నియంత్రణకు సంబంధించిన ఎలాంటి పరికరాలు కూడా కనిపించవు. నిత్యం పోలీసులు సిబ్బంది విధులు, ఇక్కడకు ఫిర్యాదులపై వచ్చే ప్రజలు.. ఇక్కడ ఏదైనా జరిగితే మూల్యం చెల్లించాల్సిందే.

మరి ఈ పోలీసు స్టేషన్‌‌కు ఆనుకుని అదే అంతస్థుల్లో ఉన్న అపార్టుమెంట్లకు.. నివాస భవనాలకు.. ఫైర్ డిపార్టుమెంట్ ఫైర్ సేఫ్టీ వాటర్ పైప్ లైన్లు వేయించింది. మరి ఫైర్ డిపార్టుమెంట్ ఈ పోలీసు స్టేషన్‌‌కు నో అబ్జక్షన్‌ సర్టిఫికేట్ ఎలా ఇచ్చింది? కాంట్రాక్టర్ ఎలా నిర్మాణం చేశారు?. ఈ ప్రశ్నలకు సమాధానం వెతికినా దొరకదు. ఎందుకంటే.. అది పోలీసు స్టేషన్.

ఇలా ఒకటి రెండు ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే కాదు.. దినదినాభివృద్ధి చెందుతున్న భాగ్యనగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ వర్గాలు ఇప్పటికైనా తేరుకుని తగు చర్యలు చేపడితే ఫలితం ఉంటుంది. లేదంటే.. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయందో ఆందోళన చెందాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఏదైనా జరుగరానిది జరిగితే భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.

Also read:

IPL 2022: వరుసగా రెండో మ్యాచ్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. కెప్టెన్‌ ఇన్సింగ్స్‌ ఆడిన విలియమ్సన్..

Investment: ఇన్వెస్ట్మెంట్స్ చేయడంలో మహిళలు ఎందుకు వెనకబడుతున్నారు.. కారణమేంటంటే..

విద్యార్ధులకు అలర్ట్! TSRJC CET 2022 దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu