AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: కోమటి రెడ్డికి ‘స్టార్’ స్టేటస్ అందుకేనా!.. ప్రత్యేక కథనం మీకోసం..

Komati Reddy Venkat Reddy: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి.. ‘స్టార్‌’..! ఇది దేనికి సంకేతం?. ఎన్నికల సమయంలో ఇచ్చే పదవి

Telangana Congress: కోమటి రెడ్డికి ‘స్టార్’ స్టేటస్ అందుకేనా!.. ప్రత్యేక కథనం మీకోసం..
Komatireddy Venkat Reddy
Shiva Prajapati
|

Updated on: Apr 12, 2022 | 5:40 AM

Share

Komati Reddy Venkat Reddy: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి.. ‘స్టార్‌’..! ఇది దేనికి సంకేతం?. ఎన్నికల సమయంలో ఇచ్చే పదవి ఇప్పుడే ఎందుకు..? పార్టీలో సెకండ్‌ పొజిషనా? లేక బుజ్జగింపా..? ప్రత్యేక కథనంలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆపార్టీ అధిష్టానం గౌరవ ప్రదమైన పదవిని కట్టబెట్టింది. ఆయన దూకుడిని మరింత ప్రొత్సహిస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చే స్టార్ క్యాంపెయినర్‌ పోస్టును ఏడాది ముందే కట్టబెట్టింది. ఏఐసీసీలో ఏదైనా పదవి కానీ, ఇతర రాష్ట్రాలకు పార్టీ ఇన్‌చార్జిగా పంపుతారని తొలుత అంతా భావించారు. కానీ రాష్ట్రంలోనే కీలకమైన బాధ్యత అప్పగిస్తూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయం తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కోమటిరెడ్డికి ఈ పదవి ఇవ్వడం వెనుక అధిష్టానానికి ప్రత్యేకమైన ఆలోచన ఉందని, రాష్ట్రంలో పార్టీ ఏకపక్షంగా ముందుకెళ్లకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పార్టీలో సీనియర్లను సమన్వయం చేయడం పీసీసీకి తలనొప్పిగా మారడంతో వారిని సమన్వయం చేసే బాధ్యత కోమటిరెడ్డికి అప్పగిస్తూ, స్టార్‌ క్యాంపెయినర్‌ హోదా కల్పించిందనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. ఇక పార్టీ కార్యక్రమాల నిర్వహణలో పీసీపీతోపాటు మరో కీలక నేతకూ భాగం కల్పించాలన్న ఉద్దేశంతోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ముందుకు తెచ్చారనే చర్చ కూడా నడుస్తోంది.

ఇక ‘స్టార్’ క్యాంపెయినర్‌ పదవిపై కోమటిరెడ్డి స్పందించారు. అధిష్టానం ప్రకటనపై సంతోషం వ్యక్తం చేశారు. శ్రీరామనవమి రోజున తనకు పార్టీ మంచి పదవిని కట్టబెట్టడం సంతోషంగా ఉందన్నారాయన. ఇప్పటివరకు నల్లగొండకే పరిమితమైన తన పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తానని చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తానని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

Also read:

IPL 2022: వరుసగా రెండో మ్యాచ్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. కెప్టెన్‌ ఇన్సింగ్స్‌ ఆడిన విలియమ్సన్..

Investment: ఇన్వెస్ట్మెంట్స్ చేయడంలో మహిళలు ఎందుకు వెనకబడుతున్నారు.. కారణమేంటంటే..

విద్యార్ధులకు అలర్ట్! TSRJC CET 2022 దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే..