Telangana: జనగామలో బరితెగించిన చైన్ స్నాచర్.. పసిబిడ్డ ప్రాణం తీశారు కదరా..!

Telangana: జనగామ జిల్లాలో దారుణం జరిగింది. చైన్ స్నాచర్ల బరి తెగింపు అభంశుభం ఎరుగని పసిబాలిక ప్రాణాలు మింగేసింది. ఓ మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడు..

Telangana: జనగామలో బరితెగించిన చైన్ స్నాచర్.. పసిబిడ్డ ప్రాణం తీశారు కదరా..!
Chain Snatchers
Follow us

|

Updated on: Aug 01, 2022 | 4:54 PM

Telangana: జనగామ జిల్లాలో దారుణం జరిగింది. చైన్ స్నాచర్ల బరి తెగింపు అభంశుభం ఎరుగని పసిబాలిక ప్రాణాలు మింగేసింది. ఓ మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడు అపహరించుకు పోయేందుకు ప్రయత్నించిన చైన్ స్నాచర్ ఆ మహిళ ప్రతిఘటించడంతో తన చేతిలోని పసిబిడ్డను నీళ్ళ సంపులో వేశాడు. దీంతో తొమ్మిది నెలల పసికందు ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ సంఘటన జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో జరిగింది.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అంబేద్కర్‌ నగర్‌ కాలనీలో నివసిస్తున్న బాస్కర్ – ప్రసన్న దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్న కూతురు తొమ్మిది నెలల బాలికతో ప్రసన్న తన ఇంటివద్ద ఒంటరిగా ఉంది. ఈ క్రమంలో ఓ దొంగ గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించాడు. మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడు లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ ప్రసన్న ప్రతిఘటించడంతో ఆమె ఒళ్లోని పసిబాలికను తీసుకెళ్లి ఇంటి ముందున్న నీళ్ళ సంపులో పడేశాడు. అప్పటికే గేటు బయట మరోవ్యక్తి బైక్ పై కాపు కాసికొని ఉండడంతో పారిపోయాడు.

ప్రసన్న అరుపులు విని అక్కడికి చేరుకున్న స్థానికులు.. నీళ్ల సంపులో మునిగిన తొమ్మిది నెలల పసికందు తేజస్వి ని బయటకు తీశారు. ఆస్పత్రికి తరలిస్తుండగా పసికందు ప్రాణాలు కోల్పోయింది. దీంతోబాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, ఈ దారుణ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడు కోసం బాలికను నీళ్ల సంపులో వేసిన దొంగ.. ఆ పుస్తెలతాడు ఎందుకు వదిలి వెళ్లాడనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.