AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nizam Nawab: తొమ్మిదో నిజాంగా బాధ్యతలు చేపట్టిన రౌనఖ్‌ యార్‌ ఖాన్‌..

నిజాంల ఆసిఫ్ జాహీ రాజవంశానికి 9వ అధిపతిగా నవాబ్ రౌనక్ యార్ ఖాన్ బాధ్యతలు తీసుకున్నారు. హైదరాబాద్​చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ 57వ వర్ధంతి నాడు నజ్రీ బాగ్ ప్యాలెస్ సమీపంలోని కింగ్ కోటి వద్ద ఉన్నసమాధిని సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 7వ నిజాం కుటుంబ సభ్యులందరి సమాధులు కలిగి ఉన్న మస్జిద్ ఎ జూడీని నవాబ్ రౌనక్ యార్ ఖాన్ సందర్శించారు.

Nizam Nawab: తొమ్మిదో నిజాంగా బాధ్యతలు చేపట్టిన రౌనఖ్‌ యార్‌ ఖాన్‌..
Nawab Raunaq Yar Khan
Shiva Prajapati
|

Updated on: Jun 05, 2023 | 6:10 AM

Share

నిజాంల ఆసిఫ్ జాహీ రాజవంశానికి 9వ అధిపతిగా నవాబ్ రౌనక్ యార్ ఖాన్ బాధ్యతలు తీసుకున్నారు. హైదరాబాద్​చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ 57వ వర్ధంతి నాడు నజ్రీ బాగ్ ప్యాలెస్ సమీపంలోని కింగ్ కోటి వద్ద ఉన్నసమాధిని సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 7వ నిజాం కుటుంబ సభ్యులందరి సమాధులు కలిగి ఉన్న మస్జిద్ ఎ జూడీని నవాబ్ రౌనక్ యార్ ఖాన్ సందర్శించారు. ఆకా మొయిన్ నవాబ్ హైదరాబాద్ స్టేట్‌ను గతంలో పాలించిన నిజాం 7వ తాత మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు నివాళులు అర్పించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు అమీర్ అలీ జా. తన తాతకు నివాళులు అర్పించడం గౌరవంగా ఉందన్నారు. అసఫ్ జాహీ రాజవంశం కుటుంబ సభ్యులు సహచరులు కూడా కింగ్ కోఠిలోని మసీదు జోడి వద్ద ఉన్న ఆయన సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.

విదేశాల్లో ఉంటున్న నిజాం వారసులను కాకుండా స్థానికంగా ఉంటున్న రౌనఖ్ యార్ ఖాన్‌ను తమ కుటుంబ పెద్దగా ఇంతకు ముందే ప్రకటించుకున్నారు నవాబ్ వంశస్థులు. తొమ్మిదో నిజాంగా బాధ్యతలు చేపట్టిన రౌనఖ్‌ యార్‌ ఖాన్‌కు నిజాం వంశస్తులు ఇప్పటివరకు భద్రంగా ఉంచిన మూడు చేతి కర్రలను అందించారు. రూ.లక్షల విలువచేసే చేతి కర్రలు అసఫ్‌ జాహీల వంశపారంపర్యంగా వస్తున్నాయి.

ఇందులో ఒకటి మొదటి నిజాం ప్రత్యేకంగా తయారుచేయించుకున్నారు. నాణ్యమైన చెక్కతో ఫిరోజ్‌ హుస్సేనీ డైమండ్‌ పొదిగిన ఈ చేతి కర్ర ప్రస్తుత విలువ అక్షరాలా రూ.30 లక్షల దాకా ఉంటుంది. పైభాగంలో గుండ్రని నోబ్‌ కలిగి చుట్టూరా 5 బ్రాస్‌ లైన్లతో ఉంటుంది. మరొకటి టిప్పు సుల్తాన్‌ నుంచి నిజాం రాజులు పొందారు. రోజ్‌ వుడ్‌తో వివిధ రకాల డిజైన్లతో దీనిని రూపొందించారు. దీని విలువ కూడా రూ. 30 లక్షల దాకా ఉంటుంది. ఇంకో చేతికర్ర తాజ్‌మహల్‌ సృష్టికర్త షాజహాన్‌ నుంచి వీరు పొందారు. ఇది ఏనుగు దంతంతో తయారు చేసినది. ఈ పురాతన చేతి కర్ర రేటు రూ.15 లక్షలు ఉంటుందని సొసైటీ ప్రతినిధులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!