Suicide: ఖమ్మంలో మరో మెడికో విద్యార్థి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే
రాష్ట్రంలో వైద్య విద్య చదువుతున్న విద్యార్థుల వరస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో చదివిన మెడికో ప్రీతి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటన మరవకముందే ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకుంది.

రాష్ట్రంలో వైద్య విద్య చదువుతున్న విద్యార్థుల వరస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో చదివిన మెడికో ప్రీతి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటన మరవకముందే ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఖమ్మంలోని సముద్రాల మానస(22) అనే వైద్య విద్యార్థిని పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకుని ఆత్మహత్య చేసుకుంది. వరంగల్‌కు చెందిన మానస ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతోంది. వైద్య కళాశాల ఎదురుగా ఉన్న హాస్టల్లో ఉంటోంది.
హస్టల్ భవనంలోనే గదిలో నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె ఎందుకు ఇలా ఆత్మహత్య చేసుకుందో అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు. వేధింపులా? చదువు ఒత్తిడా? మానసికంగా ఆత్మస్థైర్యం కోల్పోయిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం




