Telangana: ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు.. వావ్ అనిపించిన ‘డ్రోన్ షో’..
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని దుర్గం చెరువులో డ్రోన్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్ చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దుర్గం చెరువు వద్ద డ్రోన్ షో కనువిందు చేసింది. కేబుల్ బ్రిడ్జిపై ఒకేసారి 500 డ్రోన్స్ ప్రదర్శించారు. అవును, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని దుర్గం చెరువులో డ్రోన్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్ చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దుర్గం చెరువు వద్ద డ్రోన్ షో కనువిందు చేసింది. కేబుల్ బ్రిడ్జిపై ఒకేసారి 500 డ్రోన్స్ ప్రదర్శించారు. అవును, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 3వ తేదీన రైతు దినోత్సవం జరుపుకున్న ప్రజానికం. జూన్ 4న సురక్షా దినోత్సవం జరుపుతున్నారు. ఈ వేడుకలో భాగంగా ఆదివారం సాయంత్రం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దగ్గర లేజర్, త్రీడీ షోను ప్రదర్శించారు.
ఆ లేజర్‌షోలో తెలంగాణ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎంతగా అభివృద్ధి చెందిందో తెలుపుతూ.. వాటి ఆకృతులను ప్రదర్శించారు. మొదటగా దశాబ్ది ఉత్సవాల లోగోను చూపుతూ.. ఆ తర్వాత తెలంగాణ కోసం ఎందరో తమ ప్రాణాలను అర్పించిన వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ అమరవీరు స్తూపాన్ని ఏర్పాటు చేశారు.




భారతదేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్విగ్రహం, తెలంగాణ శ్వేతసౌధం, కాళేశ్వరం ప్రాజెక్టు, వేముల వాడ మల్లన్న స్వామి, సీఎం కేసీఆర్, టీహబ్, పోలీసుల లోగో, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం, సైబరాబాద్ పోలీస్‌లోగో, షీ టీమ్స్ లోగో.. ఆఖరికి జై తెలంగాణ జై భారత్అనే నినాదంతో లేజర్ షోముగిసింది. ఈ లేజర్‌షోను చూసేందుకు వచ్చిన జనం.. ఆ షోను చూసి ఆనందం, ఆశ్చర్యంతో కరతాల ధ్వనులతో తెలంగాణ వేడుకలను జరుపుకున్నారు.
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో సురక్షాదినోత్సవం ఘనంగా నిర్వహించారు. బైక్, పోలీస్ వాహనాలతో వినూత్న రీతిలో ర్యాలీ చేశారు పోలీసులు. ఇలా అన్ని జిల్లాల్లో సురక్షాదినోత్సవం ఘనంగా నిర్వహించారు.
Drone-Show on the Occasion of Telangana Dashabdi Utsavalu at Durgam Cheruvu #TelanganaSurakshaDiwas https://t.co/3KQKu9y20d
— Cyberabad Police (@cyberabadpolice) June 4, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
