Congress Protest: 21న నల్గొండలో కాంగ్రెస్ నిరసన దీక్ష.. సీనియర్ల అసంతృప్తి.. ఎందుకో తెలుసా..?
కాంగ్రెస్‌లో అంతే. అందరూ సీతయ్యలే.! నిరుద్యోగ నిరసన దీక్ష విషయంలో ఇది మరోసారి క్లియర్‌గా బయటపడింది. నేతల మధ్య విభేదాలతో ఏకంగా కార్యక్రమాన్నే వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈనెల 21న నల్గొండలో నిరసన దీక్ష, ఆ తర్వాత బహిరంగ సభను భారీ ఎత్తున..
కాంగ్రెస్‌లో అంతే. అందరూ సీతయ్యలే.! నిరుద్యోగ నిరసన దీక్ష విషయంలో ఇది మరోసారి క్లియర్‌గా బయటపడింది. నేతల మధ్య విభేదాలతో ఏకంగా కార్యక్రమాన్నే వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈనెల 21న నల్గొండలో నిరసన దీక్ష, ఆ తర్వాత బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేసింది పీసీసీ. గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టిమరీ తేదీ ప్రకటించారు రేవంత్‌రెడ్డి. అయితే ఈ కార్యక్రమం గురించి తనకు ఎలాంటి అధికారిక సమాచారమూ లేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.
అటు మరో సీనియర్ లీడర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా దీక్షకు హాజరుకావడం లేదని ప్రకటించారు. పార్టీ బలహీనంగా ఆదిలాబాద్, కరీంనగర్ లాంటి జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుండేదని అన్నారు. అభివృద్ధి అంశాలపై కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీ రావడం వల్ల… దీక్షకు రాలేనంటూ తేల్చేశారు.
నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్లు అసంతృప్తిగా ఉన్న విషయం హైకమాండ్ దృష్టికి కూడా వెళ్లింది. ముందుగానే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని .. అందుకే నిరుద్యోగ దీక్ష తేదీని మార్చాలంటూ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు థాక్రేకు విజ్ఞప్తి చేశారు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆ తర్వాత థాక్రే సీన్‌లోకి దిగినట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన సీనియర్ లీడర్లను కాదని.. దీక్ష నిర్వహించడం ఏమాత్రం మంచిది కాదని భావించినట్లు తెలుస్తోంది..! ఆ వెంటనే దీక్షను వాయిదా వేస్తున్నట్లు పీసీసీ నుంచి ప్రకటన వచ్చింది. అందరితో చర్చించిన తర్వాత మరో తేదీని వెల్లడిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు.
మొత్తానికి రేవంత్‌కు సీనియర్లకు మధ్య ఉన్న గ్యాప్ మరోసారి బయటపడింది. మరి నల్గొండలో సభను నిర్వహిస్తారా? లేక పార్టీ పటిష్టంగా ఉన్న చోట ఇలాంటి కార్యక్రమాలు ఎందుకున్న సీనియర్ల మాటకు తలొగ్గుతారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి