AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అక్కడెలా పెట్టావ్‌ బ్రో.. హైదరాబాద్‌లో కారు బీభత్సం.. రోడ్డుపై పల్టీలు కొట్టి..

రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనమెంత జాగ్రత్తగా వెళ్తున్నామనేది కాదు.. ఎదుటివాళ్లు కూడా ఎలా వస్తున్నారో గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికి వారు అప్రమత్తంగా ఉంటే ఎలాంటి ప్రమాదం జరగదు. కానీ, మద్యం తాగి వాహనం నడుపుతూ రోడ్డు మీద వెళ్తూ ఇబ్బందులు పెట్టేవారు ఎంతో మంది ఉంటారు. తాజాగా జరిగిన ఘటనలో కూడా ఓ వ్యక్తి ఏకంగా తన కారుతో డివైడర్‌ను ఢీకొట్టాడు. ఫుల్లుగా మద్యం సేవించి కారు నడిపడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Watch Video: అక్కడెలా పెట్టావ్‌ బ్రో.. హైదరాబాద్‌లో కారు బీభత్సం.. రోడ్డుపై పల్టీలు కొట్టి..
Telngana News
Noor Mohammed Shaik
| Edited By: Anand T|

Updated on: Nov 11, 2025 | 12:47 PM

Share

నల్గొండ ఎక్స్‌ రోడ్డు వద్ద సోహైల్ వెవ్స్ హోటల్ సమీపంలో ఓ కారు డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ఘటన దబీర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాత్రి వేళ వేగంగా వెళ్తున్న కారు నియంత్రణ కోల్పోయి నల్గొండ ఎక్స్‌ రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. అదృష్టవశాత్తు ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.. కాకపోతే కారు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారంతో హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదానికి గురైన కారును పరిశీలించారు.

అతి వేగం లేదా మద్యం సేవించి వాహనం నడపడమే ప్రమాదానికి కారణం కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అనంతరం ప్రమాదానికి గురైన వాహనాన్ని క్రేన్ సహాయంతో డివైడర్‌ మీద నుంచి తొలగించారు. ఈ ప్రమాదం రాత్రి వేళ జరగడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు చెబుతున్నారు. పగటి పూట జరిగి ఉంటే పెను ప్రమాదం సంభవించి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో చూడండి..

రోజూ ఎక్కడో చోట జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిల్ పోలీసులు, సిబ్బంది ఖచ్చితంగా వాహనదారులను అప్రమత్తం చేస్తుండాలని అంటున్నారు. మరీ ముఖ్యంగా రాత్రి సమయాల్లో చెకింగ్ అనేది నగరాల్లాంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా అమలు చేయాలని చెబుతున్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు తేలితే వెంటనే చర్యలు చేపట్టాలని, వాహనాన్ని సీజ్ చేయాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.