AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate: మహిళలకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. 10 గ్రాములపై ఏకంగా..

తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా తగ్గిన బంగారం వెండి ధరలు.. సోమవారం, మంగళవారం భారీగా పెరిగాయి.. మంగళవారం పది గ్రాముల బంగారంపై ఏకంగా రూ.2,500 వరకు ధర పెరిగింది. వెండి కూడా రూ.3వేల వరకు పెరిగింది.

Gold Rate: మహిళలకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. 10 గ్రాములపై ఏకంగా..
బంగారం ధరల తగ్గుదలని పూర్తిగా తోసిపుచ్చలేమని ప్రపంచ బంగారు మండలి చెబుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందితే, డాలర్ బలపడితే, 2026లో అమెరికా బాండ్ దిగుబడి పెరిగితే, బంగారం ధరలు 5% నుండి 20% వరకు తగ్గవచ్చు.
Shaik Madar Saheb
|

Updated on: Nov 11, 2025 | 10:53 AM

Share

ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే.. రికార్డు స్థాయిలో పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు.. ఆ తర్వాత దాదాపు 10 వేల వరకు తగ్గాయి. తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా తగ్గిన బంగారం వెండి ధరలు.. సోమవారం, మంగళవారం భారీగా పెరిగాయి.. మంగళవారం పది గ్రాముల బంగారంపై ఏకంగా రూ.2,500 వరకు ధర పెరిగింది. వాస్తవానికి బంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటాయి.. ఒక్కో రోజు బంగారం, వెండి ధర పెరిగితే.. మరికొన్ని రోజులు తగ్గుతూ వస్తాయి. తాజాగా.. 10 గ్రాముల పసిడిపై రూ.2,460 మేర ధర పెరిగింది. ఇక వెండి కిలోపై రూ.3వేల మేర ధర పెరిగింది.

పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. మంగళవారం (నవంబర్ 11 2025) ఉదయం నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి..

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2,460 మేర పెరిగి.. రూ.1,26,280 గా ఉంది.

22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.2,250 మేర రేటు పెరిగి.. రూ.1,15,750 గా ఉంది.

వెండి కిలోపై రూ.3,000 మేర ధర పెరిగి.. రూ.1,60,000 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,26,280 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.1,15,750 ఉంది.. కిలో వెండి ధర రూ.1,70,000 లుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,26,280, 22 క్యారెట్ల ధర రూ.1,15,750 గా ఉంది.. కిలో వెండి ధర రూ.1,70,000 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,26,430, 22 క్యారెట్లు రూ.1,15,900 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,60,000లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,26,280, 22 క్యారెట్లు రూ.1,15,750 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,60,000 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,27,640, 22 క్యారెట్ల ధర రూ.1,17,000 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,70,000లుగా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,26,280, 22 క్యారెట్ల ధర రూ.1,15,750 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,60,000 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us