Tribes: నల్లమలలో ఆత్మహత్య చేసుకుంటాం.. గ్రామ దేవతలకు మొక్కి అడవిలోకి వెళ్లిన ముగ్గురు చెంచు రైతులు
ఆదివాసీల దినోత్సవం రోజునే గిరిజనులు ఆత్మహత్యాయత్నం చేశారు. నల్లమల అడవుల్లో నివసించే ముగ్గురు చెంచులు.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రకటించారు. గ్రామదేవత ముందు ప్రమాణం చేసి..
ఆదివాసీల దినోత్సవం రోజునే గిరిజనులు ఆత్మహత్యాయత్నం చేశారు. నల్లమల అడవుల్లో నివసించే ముగ్గురు చెంచులు.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రకటించారు. గ్రామదేవత ముందు ప్రమాణం చేసి మరీ పురుగుల మందుతో అడవిలోకి వెళ్లారు ఈ గిరిజనులు. తమ ప్రాణత్యాగంతోనైనా చెంచుల సమస్యలు పరిష్కారమవ్వాలని.. అందుకే తాము ప్రాణాలర్పిస్తున్నట్లు ప్రకటించారు. అటవీశాఖాధికారులు తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని.. వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. తమ బలిదానం తర్వాతైనా చెంచులను కాపాడాలని కోరుతున్నారు. ఫ్రభుత్వ అధికారులు, అటవీ శాఖ అధికారులు తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని, వేధింపులకు పాల్పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
మనస్థాపానికి గురై తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, తమ బలిదానం తర్వాతనైనా చెంచులను కాపాడాలని వారు కోరుతున్నారు. ఆదివాసీయుల సంఘం నాయకుడు చిర్ర రాములు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ముగ్గురు ఉన్న ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు.
ప్రపంచమంతా సోమవారం ఆదివాశీ దినోత్సవాలు జరుపుకుంటుంటే.. ఇక్కడ మాత్రం తమకు కనీస సౌకర్యాల కోసం పోరాడుతున్నారు గిరిజనం. ఉత్సవాలు కాదు కదా.. మా కష్టాలు తీర్చడంటూ మొరపెట్టుకుంటున్నారు గిరిజనులు. భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 75 ఏళ్లు అయినా.. తమకు కనీస సౌకర్యాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే అడవిలోకి వెళ్లిన
ఇవి కూడా చదవండి: Journalist Murder: గుట్కా మాఫియా చేతిలో జర్నలిస్టు కేశవ దారుణ హత్య.. కర్నూలు జిల్లాలో దారుణం..