Munugode Bypoll: వార్ వన్ సైడేనా.. టగ్ ఆఫ్ వారా?.. పార్టీలను హడలెత్తిస్తున్న ఓటింగ్ పర్సంటేజ్..
మునుగోడు పెరిగిన ఓటింగ్ శాతం దేనికి సంకేతం. పెరిగిన పోలింగ్ శాతం ఫలితాల్లో కీరోల్ కాబోతుందా?. అత్యధిక ఓటింగ్ పర్సెంటేజ్ ఫలితాలను తారుమారు చేస్తుందా?.
మునుగోడు పెరిగిన ఓటింగ్ శాతం దేనికి సంకేతం. పెరిగిన పోలింగ్ శాతం ఫలితాల్లో కీరోల్ కాబోతుందా?. అత్యధిక ఓటింగ్ పర్సెంటేజ్ ఫలితాలను తారుమారు చేస్తుందా?. వార్ వన్ సైడేనా.. లేదా టగ్ ఆఫ్ వారా? మునుగోడు బైపోల్ ఫలితంపై భారీ ఉత్కంఠ నెలకొంది. ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడం ఆసక్తి రేపుతుంది. పెరిగిన ఓటింగ్ ఎటువైపు మొగ్గిందనే అంచనాలు నెలకొన్నాయి. 2018 సార్వత్రిక ఎన్నికల కంటే మొన్న జరిగిన మునుగోడు బైపోల్ లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 2018లో మునుగోడులో 91.07 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇప్పుడు ఏకంగా 93.13 శాతంతో తెలంగాణలో అత్యధిక పోలింగ్ జరిగిన ఎన్నికగా రికార్డుకెక్కింది. 2018 ఎన్నికల్లో ఖమ్మం జిల్లా మధిరలో 91.27 శాతం ఓటింగ్ నమోదైంది. మొన్నటి వరకు మధిరదే రికార్డు. తాజాగా ఆ రికార్డును మునుగోడు బైపోల్ బద్దలు కొట్టింది.
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 2,41,805 లక్షల మంది ఓటర్లు ఉండగా 2,25,192 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇక మండలాల వారీగా పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే నారాయణపురం మండలంలో అత్యధికంగా ఓట్లు పడ్డాయి. ఇక్కడ మొత్తం 36,430 ఓట్లుండగా.. 93.76శాతంతో 34,157మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత చౌటుప్పల్‌లో 93.68శాతంతో 59,433 ఓట్లకు.. 55,678 ఓట్లు పడ్డాయి. చండూరులో 93.51శాతంతో 33,509 ఓట్లు ఉండగా.. 31,333 ఓట్లు పోలయ్యాయి. మునుగోడులో 93.50శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ 35,780 ఓట్లుండగా 33,455మంది ఓటు వేశారు. ఇక గట్టుప్పల్‌లో 14,525 మంది ఓటర్లు ఉండగా.. 92.61శాతంతో 13,452 మంది ఓటేశారు. నాంపల్లి మండలంలో 92.37శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 33,819 మంది ఓటర్లు ఉండగా.. 31,240 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మర్రిగూడలో అత్యల్పంగా పోలింగ్ నమోదైంది. ఇక్కడ 28,309 ఓట్లుండగా 91.41శాతంతో 25,877 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ13 కేంద్రాల్లో రాత్రి 9.30 గంటల వరకు ఓటింగ్ జరిగింది.
అయితే, పెరిగిన ఓటింగ్ సరళి ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి రాజకీయ పార్టీల్లో నెలకొంది. సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి వరకు జరిగిన పోలింగ్ ఫలితాల్లో కీ రోల్ కాబోతుందనే టాక్ వినిపిస్తుంది. యువత సైలెంట్ ఓటింగ్ ఫలితాలను తారు మారు చేస్తాయంటున్నారు మునుగోడు ఓటర్లు. పెరిగిన ఓటింగ్.. యువత సైలెంట్ ఓటింగ్ వార్ వన్ సైడేనా.. లేదా టగ్ ఆఫ్ వార్ ను తలపిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది.
నారాయణపురం
మొత్తం ఓట్లు 36,430 పోలైన ఓట్లు 34,157 పోలింగ్ శాతం 93.76
చౌటుప్పల్
మొత్తం ఓట్లు 59,499 పోలైన ఓట్లు 55, 678 పోలింగ్ శాతం 93.68
చండూరు
మొత్తం ఓట్లు 33,509 పోలైన ఓట్లు 31,333 పోలింగ్ శాతం 93.51
మునుగోడు
మొత్తం ఓట్లు 35,780 పోలైన ఓట్లు 33,455 పోలింగ్ శాతం 93.50
గట్టుప్పల్
మొత్తం ఓట్లు 14,525 పోలైన ఓట్లు 13,452 పోలింగ్ శాతం 92.61
నాంపల్లి
మొత్తం ఓట్లు 33,819 పోలైన ఓట్లు 31,240 పోలింగ్ శాతం 92.37
మర్రిగూడ
మొత్తం ఓట్లు 28,309 పోలైన ఓట్లు 25,877 పోలింగ్ శాతం 91.41
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..