Munugodu Bypoll Results: మునుగోడు ఫలితం తెలంగాణ రాజకీయాల్ని మలుపు తిప్పబోతోందా?..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Nov 06, 2022 | 6:04 AM

మునుగోడు ఫలితం నిజంగానే తెలంగాణ రాజకీయాల్ని మలుపు తిప్పబోతోందా?. ఏ పార్టీ గెలుస్తే ఏం జరుగుతుంది. మునుగోడు ఎన్నికపై ఏవరేమంటున్నారు?

Munugodu Bypoll Results: మునుగోడు ఫలితం తెలంగాణ రాజకీయాల్ని మలుపు తిప్పబోతోందా?..
Munugode Polling Arrangements

మునుగోడు ఫలితం నిజంగానే తెలంగాణ రాజకీయాల్ని మలుపు తిప్పబోతోందా?. ఏ పార్టీ గెలుస్తే ఏం జరుగుతుంది. మునుగోడు ఎన్నికపై ఏవరేమంటున్నారు? ఈ కథనంలో తెలుసుకుందాం.. మునుగోడు రిజల్ట్‌పై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. బీఆర్ఎస్‌కు బోణీ అంటూ టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. కాషాయ జెండా ఎగరడం ఖాయం అంటున్నారు కమలనాథులు. ఇక పాల్వాయి లెగసీ, సైలెంట్‌ ఓటింగ్‌పైనే కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. బీఎస్పీ, పాల్‌ పార్టీలు ఎవరిని పడగొడతాయ్‌? సైలెంట్‌ ఓటింగ్‌ ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఒకే ఒక్క ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్ని మలుపుతిప్పబోతోంది. అవును, మునుగోడు రిజల్ట్‌ నిజంగానే తెలంగాణ పాలిటిక్స్‌ని టర్న్‌ తిప్పబోతున్నాయ్‌. 2023లో ఎవరు ఎవరితో తలపడబోతున్నారో క్లియర్‌ పిక్చర్‌ ఇవ్వబోతోంది మునుగోడు. టీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్‌కి ఊపు రావడం ఖాయం. అదే, కమలం గెలిస్తే మాత్రం తెలంగాణ రాజకీయ ముఖచిత్రమే మారిపోనుంది. కాంగ్రెస్‌ గెలిచిందంటే పెను సంచలమే అవుతుంది. గెలుపుపై ఎవరి లెక్కలు వాళ్లకున్నా, ప్రధాన పార్టీల భవితవ్యాన్ని మాత్రం మునుగోడు నిర్దేశించబోతోందన్నది మాత్రం నిజం.

మూడు నెలల హోరాహోరీ క్యాంపెయిన్‌.. నువ్వానేనా, బస్తీమే సవాల్‌ అన్నట్టుగా సాగిన హైఓల్టేజ్‌ ఫైట్‌.. టోటల్‌గా మునుగోడు సెంట్రిక్‌గా జరిగిన గేమ్ ఛేంజర్‌ పొలిటికల్‌ వార్‌. కేవలం తెలంగాణనే కాదు.. యావత్‌ దేశాన్నే అట్రాక్ట్‌ చేసిన ఉపఎన్నిక ఇది. నెక్ట్స్‌ తెలంగాణలో అధికారం తమదేనంటోన్న బీజేపీ.. మునుగోడు బైపోల్‌ను గేమ్‌ ఛేంజర్‌గా ఎంచుకుంది. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ సైతం ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నేషనల్‌ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తూ తొలి గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డారు. పోటాపోటీగా ప్రచారం చేయడమే కాకుండా, ఓటర్లను ప్రలోభాలను గురిచేయడంలో పోటీపడ్డాయి పార్టీలు.

ఇవి కూడా చదవండి

సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌ బీజేపీ మధ్యే ఫైట్‌ అంటున్నాయ్‌. మెజారిటీ సర్వేలు గులాబీ పార్టీదే గెలుపు అంటుంటే.. కొన్ని మాత్రం కాషాయ జెండా ఎగరడం ఖాయమని చెబుతున్నాయ్‌. గెలిచేది ఎవరైనా మెజారిటీ మార్జిన్‌ తక్కువేనన్నది సర్వేల మాట. అయితే, సాయంత్రం ఐదు గంటల తర్వాత జరిగిన ఓటింగ్‌.. పార్టీల లెక్కలు, అంచనాలను మార్చేయడం ఖాయమనే టాక్‌ వినిపిస్తోంది. చివరి మూడు గంటల్లో నమోదైన 20శాతం ఓట్లు టోటల్‌ పిక్చర్‌నే ఛేంజ్‌ చేయబోతుందనే మాట రీసౌండ్ వస్తోంది. ఎందుకంటే, సాయంత్రం 5 తర్వాతే కథ అసలు మలుపు తిరిగిందని చెప్తున్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఓటర్లు ఒక పార్టీకి వన్‌సైడ్‌గా గుద్దేశారన్నది మునుగోడు సెంటర్‌లో వినిపిస్తోన్న మాట.

ఇక, గుర్తుల గందరగోళం కూడా ప్రధాన పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపించబోతున్నాయ్‌. కారును పోలిన గుర్తులు టోటల్‌ ఫలితాన్నే మార్చేసే ఛాన్స్‌ కూడా కనిపిస్తోంది. ఇక, బీఎస్పీ, పాల్‌ పార్టీలు చీల్చే ఓట్లు.. ఏ పార్టీని దెబ్బకొట్టబోతున్నాయనేది ఆసక్తి రేపుతోంది. ఎవరి ధీమా ఎలాగున్నా, అభ్యర్ధుల భవితవ్యం మరికాసేపట్లో తేలిపోనుంది. ఈవీఎమ్స్‌లో నిక్షిప్తమైన పార్టీల ఫ్యూచర్‌ ఇంకొద్దిసేపట్లోనే బయటపడబోతోంది. మరి, మునుగోడు యుద్ధంలో గెలిచే మొనగాడెవరు?. మునుగోడు ఫలితం తెలంగాణ రాజకీయాలను ఎలాంటి టర్న్‌ తిప్పబోతోంది? అనేది తేలాలంటే మరికాసేపు వేచి చూడాల్సిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu