Telangana: జీవితం అంటే ఇంతే! ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం..

విద్యుత్ షాక్ తో తల్లి కూతుళ్లు మృతి..నిద్రలోనే మరణం..విషాదంలో రత్నాపూర్ గ్రామం.. అందరూ కలిసి భోజనం చేశారు..సంతోషంగా గడిపారు..మరింత రాత్రి కావడంతో నిద్ర పోయారు..కానీ.. తెల్లారే వరకు విగత జీవులయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా?

Telangana: జీవితం అంటే ఇంతే! ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం..
Mother And Daughter Died Due To Shock
Follow us
G Sampath Kumar

| Edited By: Velpula Bharath Rao

Updated on: Oct 29, 2024 | 12:50 PM

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని రాంనగర్లో ఓ ఇంట్లో రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది ఇద్దరు మహిళలు సజీవ దహనమాయ్యారు.. గుర్తుపట్టనంతగా కాలిపోయి మృతి చెందారు. ఈ ఇంట్లో కనకయ్య తన భార్య, అత్తతో కలిసి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. గడ్డం కోమురమ్మ (45), కల్వల పోచమ్మ (65) అనే ఇద్దరు తల్లి కూతుళ్ళు మృతి చెందారు. అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇళ్ళంతా మంటలు వ్యాపించాయి. దీంతో నిద్రిస్తున్న ఈ ఇద్దరు మృత్యువాత పడ్డారు..అయితే..ఈ సమయంలో కనుకయ్య ఇంట్లో లేరు..ఆలస్యంగా ఇంటికీ వచ్చిన కనుకయ్య చూసి షాక్ గురయ్యడు.అప్పటికే ఇళ్ళు మొత్తం కాలిపోయింది.. ఈ మంటల్లో ఇద్దరు చిక్కుకొని చనిపోయారు.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించి పరిసరాలను పరిశీలించారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. ప్రమాదం జరిగిందా.. ఇంకా ఏమైనా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రత్నాపూర్ గ్రామంలో విషాదం అలుముకుంది. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

వీడియో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.