Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Kavitha: మ‌హిళా బిల్లు ఆమోదించాలంటే ఒక్క నిమిషం చాలు.. బీజేపీ, కాంగ్రెస్‌లపై మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత

దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. మహిళా బిల్లుపై బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. మహిళా బిల్లు గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. పెంచబోయే పార్లమెంటు సీట్లలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని, ఇదే తమ నాయకుడు సీఎం కేసీఆర్ విధానమని స్పష్టం చేశారు. జాతీయస్థాయి జర్నలిస్టు నిధి శర్మ రాసిన 'షి ద లీడర్ విమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్' అనే పుస్తక ఆవిష్కరణ సభ..

MLC Kavitha: మ‌హిళా బిల్లు ఆమోదించాలంటే ఒక్క నిమిషం చాలు.. బీజేపీ, కాంగ్రెస్‌లపై మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత
Mlc Kavitha
Follow us
Sridhar Prasad

| Edited By: Shiva Prajapati

Updated on: Aug 12, 2023 | 6:45 AM

దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. మహిళా బిల్లుపై బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. మహిళా బిల్లు గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. పెంచబోయే పార్లమెంటు సీట్లలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని, ఇదే తమ నాయకుడు సీఎం కేసీఆర్ విధానమని స్పష్టం చేశారు. జాతీయస్థాయి జర్నలిస్టు నిధి శర్మ రాసిన ‘షి ద లీడర్ విమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్’ అనే పుస్తక ఆవిష్కరణ సభ ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవిత దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలన్నారు. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలో అన్ని ఇండ్లలో ఏం జరుగుతుందో రాజకీయ పార్టీల్లో కూడా అదే జరుగుతుందన్నారు. మహిళలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలన్న తప్పనిసరి నిబంధన లేనంత వరకు పార్టీల్లో అదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు 50 శాతం కాకుండా 33 శాతం రిజర్వేషన్ ఎందుకన్న చర్చ కూడా జరుగుతోందని, ఎక్కడో ఒక చోట అడుగుముందుకు పడాలని అన్నారు. అత్యధిక మెజారిటీ ఉన్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మహిళా బిల్లును ఆమోదించాలనుకుంటే ఒక్క నిమిషం చాలు అని, కేంద్రం ఆ రకంగా ఆలోచించడం లేదన్నారు. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల పేర్లను మార్చి కొత్త చట్టాలు తీసుకురావడానికి మూడు బిల్లులను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. పెంచబోయే పార్లమెంటు సీట్లల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని తెలిపారు.

కార్పొరేట్ రంగంలో మహిళలకు బోర్డు రూముల్లో మహిళల ప్రాతినిధ్యం స్వల్పంగా ఉందని, వివక్ష కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ప్రారంభిస్తున్న దాదాపు 80 శాతం స్టార్టప్ సంస్థలకు బ్యాంకుల మద్ధతివ్వడం లేదని, బ్యాంకులు సహకరిస్తున్న వాటికి సంబంధించి కూడా పురుషుల వ్యాపారాలతో పోల్చితే మహిళలు చేస్తున్న వ్యా పారానికి తక్కువ నిధులు ఇస్తున్నాయన్నారు. ఏటాటే ఉద్యోగ రంగంలో మహిళల శాతం తగ్గుతోందని, చదువుకున్న మహిళలకు ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించారు. దేశంలో 29 శాతం మహిళలు మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నవారని, ఇలా అయితే దేశం వృద్ధి చెందలేదని, సమాజంలో మార్పురావాలి స్పష్టం చేశారు. న్యాయస్థానాల్లో ఎంత మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారని అడిగారు. గ్రామాల్లో మహిళా సర్పంచ్లు ఇంటింటికి తిరిగి పన్నులు వసూలు చేసు న్నారని, పన్నుల రూపంలో పంచాయతీలకు రాబడిని పెంచే ప్రయత్నం చేస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం మార్కెట్ కమిటీ పదవుల్లోనూ రిజర్వేషన్ కల్పించిందని చెప్పారు. భారత్ లో కంపల్సరీ ఓటింగ్ రావాలని అభిప్రాయపడ్డారు. దీనిపై తీవ్రంగా ఆలోచించాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి వ్యవస్థపై అధ్యయనం చేయాలని సూచన చేశారు. పట్టణాలు నగరాల్లో చదువుకున్న వారు చాలా మంది ఓటేయడానికి రాకపోవడం బాధాకరమన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.