AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Medical Courses: వైద్య కోర్సుల్లో క్రీడా కోటా తొలగింపుపై రాష్ట్ర సర్కార్‌కు హైకోర్టు నోటీసులు

రిజర్వేషన్లను తొలగిస్తూ జులై 4న వైద్యారోగ్యశాఖ జీవో 75ను జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన జి హరికృష్ణ అనే వ్యక్తితోపాటు ఇతరులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. క్రీడా కోటా రిజర్వేషన్‌పై 2018లో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది జైశ్వాల్‌ వాదనలు వినిపించారు. న్యాయవాది జైశ్వాల్‌ వాదనలు విన్న ధర్మాసనం ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో..

TS Medical Courses: వైద్య కోర్సుల్లో క్రీడా కోటా తొలగింపుపై రాష్ట్ర సర్కార్‌కు హైకోర్టు నోటీసులు
Telangana High Court
Srilakshmi C
|

Updated on: Aug 11, 2023 | 9:53 PM

Share

హైదరాబాద్‌, ఆగస్టు 11: రాష్ట్ర ప్రభుత్వం ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో 0.3 శాతం క్రీడా కోటా రిజర్వేషన్లను తొలగించిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లను తొలగిస్తూ జులై 4న వైద్యారోగ్యశాఖ జీవో 75ను జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన జి హరికృష్ణ అనే వ్యక్తితోపాటు ఇతరులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. క్రీడా కోటా రిజర్వేషన్‌పై 2018లో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది జైశ్వాల్‌ వాదనలు వినిపించారు. న్యాయవాది జైశ్వాల్‌ వాదనలు విన్న ధర్మాసనం ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది.

మైనారిటీలకు గ్రూప్‌-2 మాదిరి పరీక్ష

గ్రూప్‌ 2 పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్ధులకు మైనారిటీ సంక్షేమశాఖ, మైనారిటీ స్టడీ సర్కిల్‌ కీలక ప్రకటన వెలువరించింది. గ్రూప్‌2కి సంబంధించిన మాదిరి పరీక్షను నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జి అధికారి పుష్పలత ఆగస్టు 10న ప్రకటించారు. ఈ మేరకు ఆగస్టు 16, 21, 23 తేదీల్లో హైదరాబాద్‌ సివిల్‌ సెంటర్‌ కోచింగ్‌ అకాడమీలో పరీక్షలు ఉంటాయని తెలిపారు. పరీక్ష రాయగోరేవారు పూర్తి వివరాలకు 040-23236112, 0870-2980533 నంబర్లకు ఫోన్‌ చేసి సంప్రదించాలని సూచించారు.

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు కేసీ మహీంద్ర ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ ఉపకార వేతనాలు

తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు కేసీ మహీంద్ర ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. తక్కువ ఆదాయం కలిగిన వర్గాలకు చెందిన విద్యార్థులు ఆగ‌స్టు 20 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ట్రస్ట్‌ నిర్వాహకులు ఆగ‌స్టు 10న‌ తెలిపారు. స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్ధులకు ఏడాదికి రూ.10వేల చొప్పున మొత్తం 550 మంది విద్యార్థులకు అందిస్తామన్నారు. ఇలా గరిష్ఠంగా మూడేళ్లపాటు ఇస్తారని ట్రస్ట్‌ నిర్వాహకులు తెలిపారు. కేసీ మహీంద్ర ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ ఉపకార వేతనాలకు అధికారిక వెబ్‌సైట్‌లో ‌ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..