Telangana: స్టేషన్ ఘనపూర్‌లో ఎమ్మె్ల్యే వర్సెస్ ఎమ్మెల్సీ.. కడియంకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రాజయ్య..

ఓవైపు ప్రతిపక్షాలు ఊపరిసలపని విధంగా విమర్శలు, ఆరోపణలతో అటాక్ చేస్తుంటే.. మరోవైపు సొంత పార్టీలోనే వేరు వేరు కుంపట్లు పెట్టుకుంటున్నారు అధికార టీఆర్ఎస్ నేతలు.

Telangana: స్టేషన్ ఘనపూర్‌లో ఎమ్మె్ల్యే వర్సెస్ ఎమ్మెల్సీ.. కడియంకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రాజయ్య..
Mla Rajaiah Vs Mlc Srihari
Follow us

|

Updated on: Dec 06, 2022 | 8:24 AM

ఓవైపు ప్రతిపక్షాలు ఊపరిసలపని విధంగా విమర్శలు, ఆరోపణలతో అటాక్ చేస్తుంటే.. మరోవైపు సొంత పార్టీలోనే వేరు వేరు కుంపట్లు పెట్టుకుంటున్నారు అధికార టీఆర్ఎస్ నేతలు. తాజాగా వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య డైలాగ్స్ వార్ కంటిన్యూ అవుతోంది. కడియం శ్రీహరి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రాజయ్య ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో దళితబందు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని కడియం ఆరోపిస్తే.. చిల్లర మాటలు నమ్మవద్దంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే రాజయ్య.

ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.. కొందరు ప్రజాప్రతినిధులు వాళ్ళ బంధువులకు దళితబందు ఇవ్వడం, లేదంటే లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకోవడం లాంటివి చేస్తున్నారని ఆరోపించారు. దళితబందు అద్భుతమైన పథకం అని, కానీ కొందరు ఆ పథకాన్ని నీరు గార్చే ప్రయత్నాలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు కడియం.

అయితే, కడియం ఆరోపణలపై ఎమ్మెల్సీ రాజయ్య పరోక్షంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దళితబంధు విషయంలో చిల్లర మాటలు మాట్లాడవద్దనీ.. భాష మార్చుకోవాలని పరోక్షంగా కడియం శ్రీహరిని హెచ్చరించారు రాజయ్య. నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే సుప్రీం అని తేల్చి చెబుతున్నారు. ఎమ్మెల్యే ద్వారానే లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లు వస్తాయన్నారు. సీఎం దగ్గర కూడా స్పెషల్ కోటా అంటూ ఏమి లేదని, ఉన్నది ఒకటే ఒక కోటా అదే ఎమ్మెల్యే కోటా అంటున్నారు ఎమ్మెల్యే రాజయ్య. గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పిండితేరావు అంటూ సెటైర్ కూడా వేశారు. ఇలా ఒకే పార్టీలో ఉన్న ఈ ఇద్దరు నేతలు ఇలా ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవడంతో.. క్యాడర్‌కు ఏం చేయాలో తెలియని పరిస్థితి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు