Telangana: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత వివరణపై సస్పెన్స్.. ఈరోజు అందుబాటులో ఉండటం లేదంటూ సీబీఐకి లేఖ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి తనకు తెలిసిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఎమ్మెల్సీ కవితకు సీబీఐ అధికారులు నోటీసులివ్వగా.. మంగళవారం సీబీఐ అధికారులకు కవిత వివరణ ఇవ్వాల్సి..

Telangana: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత వివరణపై సస్పెన్స్.. ఈరోజు అందుబాటులో ఉండటం లేదంటూ సీబీఐకి లేఖ..
Mlc Kavitha
Follow us

|

Updated on: Dec 06, 2022 | 7:30 AM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి తనకు తెలిసిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఎమ్మెల్సీ కవితకు సీబీఐ అధికారులు నోటీసులివ్వగా.. మంగళవారం సీబీఐ అధికారులకు కవిత వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే తాను ముందుగా షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాల కారణంగా డిసెంబర్6వ తేదీ మంగళవారం హాజరుకాలేనని ఎమ్మెల్సీ కవిత సీబీఐ అధికారులకు తెలియజేసినట్లు తెలుస్తోంది. తాను విచారణకు సహకరిస్తానని, అయితే తన బిజీ షెడ్యూల్ వల్ల 6వ తేదీ కాకుండా ఈనెల 11, 12, 14, 15 తేదీల్లో ఏదో ఒక రోజు తాను అందుబాటులో ఉంటానని పేర్కొంటూ సీబీఐ అధికారులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సీబీఐ అధికారుల నుంచి రిప్లై రావల్సి ఉంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారిస్తున్న సీబీఐ అధికారులు కవిత వివరణ తీసుకునేందుకు హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే కవిత లేఖపై ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. బుధవారం జగిత్యాలలో సీఏం కేసీఆర్ సభ ఉండటంతో.. ఆ ఏర్పాట్లను పరిశీలించేందుకు కవిత మంగళవారం జగిత్యాల వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో తన విచారణ తేదీల్లో మార్పులు చేయవల్సిందిగా కవిత సీబీఐ అధికారులను కోరినట్లు తెలుస్తోంది.

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ, సీఏం కేసీఆర్ కుమార్తె కవితకు సిబిఐ అధికారులు డిసెంబర్2వ తేదీన 160 సీఆర్పీసీ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 6వతేదీ  మంగళవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ లేదా హైదరాబాద్‌లోని కవిత నివాసంలోనే విచారణ చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి వచ్చిన ఆరోపణలపై కేంద్ర హోంశాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రాయ్ ఇచ్చిన రాత పూర్వక పిర్యాదు ఆధారంగా  నమోదు చేసిన కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు కవితను విచారణకు పిలిచిన విషయం తెలిసిందే.

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు.. మరో 14 మందిపై కేసులు నమోదు చేసినట్లు నోటీసులో తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు కవితను కోరారు. సిబిఐ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ సాహి పేరుమీద ఈ నోటీసులను జారీచేయగా.. ఢిల్లీ మద్యం పాలసీలో కవిత ప్రమేయంపై ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ