MLA Durgam Chinnaiah:ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జాతీయ మహిళా కమిషన్‌ను కలిసిన శేజల్
ఎమ్మెల్యే దీన్ని కొట్టి పారేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఆరిజన్ డైయిరీ యాజమాన్యమే స్థానిక రైతులను మోసం చేసిందని కేసులు పెట్టారు..MLAపై శేజల్ కూడా లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఆ తరువాత నుంచి వారి మధ్య వార్ నడుస్తూనే ఉంది..
ఢిల్లీ, జూన్ 08: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వర్సెస్ ఆరిజన్ డైయిరీ యాజమాన్యం వివాదం రోజురోజుకి పెద్దదవుతోంది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని శేజల్ ఆరోపిస్తూ వస్తుంది. ఇక దీనికి సంబంధించి కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది.అయితే ఎమ్మెల్యే దీన్ని కొట్టి పారేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఆరిజన్ డైయిరీ యాజమాన్యమే స్థానిక రైతులను మోసం చేసిందని కేసులు పెట్టారు..MLAపై శేజల్ కూడా లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఆ తరువాత నుంచి వారి మధ్య వార్ నడుస్తూనే ఉంది..ఎమ్మెల్యే అనుచరులు కూడా వేధిస్తున్నారని శేజల్ ఆరోపిస్తోంది.
అయితే.. ఈ కేసులో శేజల్ లేటెస్టుగా మరో వీడియో విడుదల చేసింది..MLA దుర్గం చిన్నయ్య తనను వేధింపులకు గురిచేశాడని ఆరోపించింది. బిజినెస్ మీటింగ్ పేరుతో పిలిచి మందు పార్టీ ఏర్పాటు చేశారని ఆరోపించింది. బిజినెస్ మీటింగ్‌లో మందు పార్టీ ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. బిజినెస్ మీటింగ్ అన్నప్పుడు దాని గురించే మాట్లాడాలి కదా అంటూ నిలదీసింది. తాను అనవసరంగా ఈ ఆరోపణలు చేయడం లేదని హెచ్చరించింది. తన దగ్గర ఉన్న ఆధారాలను పోలీసులు డిలీట్ చేశారని..అయినా తన దగ్గర ఇంకా ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది శేజల్..
ఇక ఇప్పుడు ఈ వ్యవహారం జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించి ఈరోజు కమిషన్ ఎదుట హాజరకావాలంటూ శేజల్‌కు మెసేజ్ పంపింది. దీంతో ఆమె కొద్దిసేపటి క్రితమే జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరైంది..MLA దుర్గం చిన్నయ్య లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తున్న శేజల్..ఆ వేధింపులపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు ఫిర్యాదు చేసింది..మరీ శేజల్ ఫిర్యాదు తర్వాత జాతీయ మహిళా కమిషన్ రియాక్షన్, యాక్షన్ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం