Coromandel Express Derail: రైలు ప్రమాదంలో తండ్రి ప్రాణాలు కాపాడిన కూతురి మొండితనం.. విండో సీటు కోసం..

ఒడిశా రైలు ప్రమాదంలో జరగడానికి ముందు కోచ్ మార్చడం ద్వారా ఒక తండ్రి 8 ఏళ్ల బాలిక తమ ప్రాణాలను కాపాడుకున్నారు. అది కూడా ఆ చిన్నారి చేసిన మొడితనం వారి ప్రాణాలను రక్షించింది. అసలు ఏం జరిగిందో ఓసారి చూద్దాం..

Coromandel Express Derail: రైలు ప్రమాదంలో తండ్రి ప్రాణాలు కాపాడిన కూతురి మొండితనం.. విండో సీటు కోసం..
Window Sitting In Train
Follow us

|

Updated on: Jun 04, 2023 | 5:41 PM

చిన్న పిల్లలు దేవుళ్లతో సమానం.. వారి మొడితనం.. పెంకితనం కొన్ని సార్లు పెద్దవారికి ఇబ్బందిగా అనిపిస్తుంది. కోపం తెప్పించినా.. సర్ధుకుపోతారు. అదే వారికి చాలా సందర్భాల్లో ప్రాణాలను కాపాడుతుంది. ఇలాంటి ఘటనలు మనం చాలా సార్లు చూసి ఉంటాం.. వార్తల్లో చదివి ఉంటాం. అచ్చు ఇలాంటి ఘటన ఒడిశా రైలు ప్రమాదంలో కూడా జరిగింది. కోచ్‌లో ఓ తండ్రి తన 8 ఏళ్ల కుమార్తెతో కూర్చోవడం పూర్తిగా కుప్పకూలడంతో అందులో ఉన్న చాలా మంది చనిపోయారు. అయితే, ప్రమాదానికి ముందు అతను తాను తన కుమార్తెతో కలిసి ఓ సీటులో కూర్చున్నారు. కానీ ఆ తర్వాత ఆ అమ్మాయి చేసిన గోలతో సీటు మార్చుకున్నాడు. సీటు మాత్రమే కాదు కోచ్ కూడా మారాడు. దాని కారణంగా వారు ఇద్దరు ప్రాణాలతో బయట పడ్డారు.

వాస్తవానికి ఏం జరిగిందో ఓసారి చూద్దాం.. తండ్రి (దాబే) కుమార్తె ఖరగ్‌పూర్ నుంచి కటక్‌లో దిగాల్సిన రైలు ఎక్కారు. మీడియా కథనాల ప్రకారం, శనివారం (జూన్ 3) తండ్రీ కూతుళ్లు డాక్టర్‌ అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. థర్డ్ ఏసీ కోచ్‌లో ప్రయాణించేందుకు టికెట్ తీసుకున్నారు. ఈసీ కోచ్‌లో విండో సీట్ నుంచి బయటకు చూడటం కుదరకపోవడంతో.. తన కూతురి మొండితనంతో పక్క కోచ్‌కు మారాడు. చిన్నారి మొండితనం వల్ల టీసీతో మాట్లాడాడు.. ఈ సమయంలో విండో సీటు ఖాళీగా లేదని, అతను కావాలనుకుంటే, మరొక ప్రయాణికుడిని అభ్యర్థించడం ద్వారా తన సీటును మార్చుకోవచ్చని TC అతనికి చెప్పాడు. దీంతో వారు మరో కోచ్‌కు వెళ్లి అక్కడ కూర్చుకున్న వారిని అభ్యర్థించాడు. తమ సీట్‌కు వారి పంపించి వారు వారి సీట్లో కూర్చుకున్నారు.

సీటు మారిన కొద్ది నిమిషాలకే..

ఇలా సీట్ మారడం అంత ఈజీగా కాలేదు. టీసీ సూచన మేరకు అతను తన కుమార్తె పట్టుదలని నెరవేర్చమని ప్రయాణీకులను అభ్యర్థించడం ప్రారంభించాడు. కోచ్‌లోని చాలా మందిని అభ్యర్థించాల్సి వచ్చింది. సీట్ మారేందుకు అంతా ససేమిరా అనడంతో..  ఆ తర్వాత అతని కోచ్ నుంచి రెండు కోచ్‌లను విడిచిపెట్టి, మూడవ కోచ్‌లోని ఇద్దరు ప్రయాణీకులు తమ సీట్లలో కూర్చోవడానికి అంగీకరించేలా ఒప్పించాల్సి వచ్చింది. దాబే, అతని కుమార్తె వచ్చి ఈ ఇద్దరు ప్రయాణీకుల సీట్లపై కూర్చున్నారు. ఈ ప్రయాణీకులు వారి కోచ్ వద్దకు వెళ్లారు. ఇదంతా జరిగిన కొద్ది నిమిషాలకే ఈ రైలు ప్రమాదంలో 288 మంది మరణించారు.

ఆ ఇద్దరు ప్రయాణికులకు ఏమైంది?

మీడియా నివేదికల ప్రకారం, వ్యక్తి, అతని కుమార్తె సురక్షితంగా బయట పడగా.. మరోవైపు, వారి సీట్లలో కూర్చున్న మరో ఇద్దరు ప్రయాణీకులకు కూడా పెద్దగా నష్టం జరగలేదు. అయితే, ఈ ప్రయాణీకుల కోచ్ పూర్తిగా ధ్వసం అయ్యింది. అందులో ఉన్న చాలా మంది మరణించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం