Odisha Train Accident: ప్రమాదంలో మరో హృదయ విదారక ఘటన.. ఒకే కుటుంబంలో ముగ్గురు సోదరులు మృతి..

ఒడిశాలోని ఘోర రైలు ప్రమాదం జరగడంతో దేశవ్యాప్తంగా దిగ్బ్రాంతి వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఎన్నో కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బతుకుతెరువుకోమని, సొంత ఊరికి వెళ్లాలని ఇలా ఎన్నో అవసరాల కోసం రైలెక్కిన ప్రయాణికుల జీవితాల అర్ధాంతరంగా ముగిసిపోవడం తీవ్రంగా కలిచివేసింది.

Odisha Train Accident: ప్రమాదంలో మరో హృదయ విదారక ఘటన.. ఒకే కుటుంబంలో ముగ్గురు సోదరులు మృతి..
Odisha Train Accident
Follow us
Aravind B

|

Updated on: Jun 04, 2023 | 4:54 PM

ఒడిశాలోని ఘోర రైలు ప్రమాదం జరగడంతో దేశవ్యాప్తంగా దిగ్బ్రాంతి వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఎన్నో కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బతుకుతెరువుకోమని, సొంత ఊరికి వెళ్లాలని ఇలా ఎన్నో అవసరాల కోసం రైలెక్కిన ప్రయాణికుల జీవితాల అర్ధాంతరంగా ముగిసిపోవడం తీవ్రంగా కలిచివేసింది. అయితే పశ్చిమ బెంగాల్‌లోని ముగ్గరు సోదరులు ఈ రైలు ప్రమాదంలో మరణించడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే 24 పరగణా జిల్లాలోని చర్నీఖలీ గ్రామానికి చెందిన హరన్‌ గోయెన్‌(40) నిశికాంత్‌ గోయన్‌(35) దివాకర్‌ గోయెన్‌(32) అనే సోదరులు చాలాకాలం తమిళనాడులోనే ఉంటూ, అక్కడ దొరికిన పనులు చేస్తుండేవారు. ఇటీవలే వీరు స్వగ్రామానికి వచ్చారు. కొన్నాళ్లు ఉన్నాక తిరిగి తమిళనాడు వెళ్లేందుకు కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు.

అయితే రైలు ప్రమాదంలో ఈ ముగ్గురు చనిపోయారనే వార్త తెలియగానే వారి గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ముగ్గురు సోదరులలో ఒకరైన హరన్‌ భార్య అంజిత చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అక్కడి స్థానికులు తెలిపారు. మృతి చెందిన ముగ్గురు సోదరుల తమ్ముడు ఇటీవలే ఓ హోటల్‌లోని పనిలో చేరాడు. తండ్రిలేని ఈ కుటుంబానికి ఒక్కసారిగా దిక్కు లేకుండా పోయిందని స్థానికులు కంటతడి పెడుతున్నారు. నిశికాంత్‌‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ రైలు ప్రమాదంలో 24 పరగణా జిల్లాకు చెందిన 12 మంది మృతి చెందినట్లు పశ్చిమ బెంగాల్‌ అధికారులు తెలిపారు. 10 మంది తీవ్రంగా గాయాలయ్యాయని.. మరో 110 మంది జాడ తెలియడం లేదని చెప్పారు. ఇప్పటిదాకా 16 మంది బాధితులు వారి సొంత ఇళ్లకు చేరుకున్నట్లు వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు