AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister KTR: రెచ్చగొడితే యుద్ధానికే దిగుతాం.. అరాచకాలకు గుణపాఠం చెబుతాం.. బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్..

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో చెలరేగిన హింస తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో..

Minister KTR: రెచ్చగొడితే యుద్ధానికే దిగుతాం.. అరాచకాలకు గుణపాఠం చెబుతాం.. బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్..
Minister Ktr
Ganesh Mudavath
|

Updated on: Nov 02, 2022 | 9:30 PM

Share

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో చెలరేగిన హింస తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో హింసకు ప్రతి హింస సమాధానం కాదని అన్నారు. శాంతిని కోరుకుంటున్నాం కాబట్టి.. ఓపికగా ఉంటున్నామని చెప్పారు. దాడిలో గాయపడిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేతలను మంత్రి పరామర్శించారు. నాగోల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని హోం మంత్రి మహమూద్‌ అలీతో కలిసి పరామర్శించారు. ఉప ఎన్నిక సమయంలో మునుగోడు మండలం పలివెలలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నేతృత్వంలో టీఆర్ఎస్ నేతలపై దాడులకు పాల్పడ్డారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో సానుభూతి కోసం బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఓటమి భయంతోనే ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రి అమిత్ షా రాలేదన్న కేటీఆర్.. ఎన్నికల సమయంలో బీజేపీ ఆగడాలు ఢిల్లీ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా జరుగుతున్నాయని విమర్శించారు.

బీజేపీ అరాచకాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. అభివృద్ధి, సంక్షేమం దృష్ట్యా ఓటర్లు నిర్ణయం తీసుకోవాలి. గ‌త ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో శాంతియుత వాతావ‌ర‌ణం ఉంది. హింస‌ను కోరుకుని, రెచ్చగొడితే క‌చ్చితంగా యుద్ధానికే దిగుతాం. దాన్ని తిప్పికొట్టే శ‌క్తి, స‌త్తా మాకు ఉంది. చిల్లర ప‌నులు, మాట‌లు బంద్ చేయండి. తెలంగాణ‌లో అగ్గిపెట్టే ప్రయ‌త్నం చేస్తే.. బుద్ధి చెప్పే స‌త్తా క‌చ్చితంగా ప్రజ‌ల‌కు ఉంది. ప‌లివెల‌లో 12 మంది టీఆర్ఎస్ నాయ‌కుల‌ను గాయ‌ప‌రిచారు. ఇదే సంస్కృతిని కొన‌సాగిస్తే మేం తిర‌గ‌బ‌డ‌క త‌ప్పదు.

– కేటీఆర్, తెలంగాణ మంత్రి

ఇవి కూడా చదవండి

బీజేపీ నాయ‌కుల ఆగ‌డాలు తీవ్ర స్థాయికి చేరాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ముఖ్యంగా ఇవాళ ఎన్నిక‌ల స‌మ‌యంలో ముందస్తు ప్లాన్ ప్రకారం దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభ‌ద్రత‌ల సమస్యలను సృష్టించాల‌నే వ్యూహంతో రాజేంద‌ర్ నాయ‌క‌త్వంలో బీజేపీ కార్యక‌ర్తలు దాడుల‌కు దిగారని మంత్రి ఆక్షేపించారు. ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి, ములుగు జ‌డ్పీ ఛైర్మన్ కుసుమ జ‌గ‌దీశ్ తో పాటు 12 మంది కార్యక‌ర్తలకు గాయాలయ్యాయని చెప్పారు. రెచ్చగొట్టే మాట‌లు మాట్లాడితే స‌హించమని మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..