Minister KTR: లెక్కలు తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తా.. మీరు సిద్ధమా..? కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్ సవాల్..
తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులపై.. తన సవాల్‌కు కట్టుబడి ఉన్నానంటూ పేర్కొన్నారు. తాను చెప్పిన లెక్కలు తప్పయితే మంత్రి పదవి నుంచి తప్పుకుంటానని కేటీఆర్ స్పష్టంచేశారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులపై.. తన సవాల్‌కు కట్టుబడి ఉన్నానంటూ పేర్కొన్నారు. తాను చెప్పిన లెక్కలు తప్పయితే మంత్రి పదవి నుంచి తప్పుకుంటానని కేటీఆర్ స్పష్టంచేశారు. ఈ సందర్భంగా కేటీఆర్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కి సవాల్ చేశారు. కేంద్రానికి 8ఏళ్లలో 3లక్షల 68వేల కోట్లు ఇచ్చామని.. తిరిగి రాష్ట్రానికి ఇచ్చింది లక్షా 68వేల కోట్లు మాత్రమేనంటూ పేర్కొన్నారు. మిగతా 2లక్షల కోట్లు ఏమైపోయాయంటూ ప్రశ్నించారు. లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ పేర్కొన్నారు. ఈ సవాల్ ను కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్వీకరిస్తారా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఇన్నెళ్లలో కేంద్రం వేములవాడకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. 14 మంది ప్రధానులు చేసిన అప్పు, ఒక్క మోడీనే చేశారంటూ విమర్శించారు. మోడీ ఎవరికి దేవుడని ప్రశ్నించారు. బండి సంజయ్‌కి, గుజరాత్ వాళ్లకు కావొచ్చు అంటూ మంత్రి కేటీఆర్ విమర్శించారు. సెస్ ఎన్నికల్లో మీరు చూసింది ట్రైలరేనని, 2023లో అసలు సినిమా చూపిస్తామంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. కర్నాటక-మహారాష్ట్ర మధ్య గట్టు పంచాయితీ తెంపలేని ప్రధాని మోదీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపారంటే నమ్ముతామా అంటూ మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు.
కాగా, కొద్దిరోజుల క్రితం కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో 3 లక్షల 68 వేల కోట్లు పంపామని.. కానీ కేంద్రం తెలంగాణకు ఇచ్చింది లక్షా 68 వేల కోట్లేనంటూ పేర్కొన్నారు. తాను చెప్పింది తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. కిషన్ రెడ్డి చెప్పింది తప్పయితే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతారా అంటూ కేటీఆర్ సవాల్ చేశారు.
దీనికి గత ఆదివారం కిషన్ రెడ్డి కూడా స్పందించారు. వరంగల్ , కరీంనగర్ పట్టణాలకు రూ.392 కోట్ల నిధులు విడుదల చేశామని.. అలాగే అమృత్ పథకంలో 12 పట్టణాలకు రూ.833.36 కోట్లు విడుదల చేశామంటూ తెలిపారు. 143 పట్టణాలలో రూ.2780 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని.. పీఎంఏవై అర్భన్ పథకంలో తెలంగాణకు 2,49,465 ఇళ్లు మంజూరు చేశామని వెల్లడించారు. ఈ క్రమంలో కేటీఆర్ దీనిపై మరోసారి స్పందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..