Ponguleti: నాకు రాజకీయ గాడ్ ఫాదర్ ఎవరూ లేరు.. తెలంగాణా ప్రజలే గాడ్ ఫాదర్.. పొంగులేటి కామెంట్స్..

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చిన్న రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తినన్న ఆయన.. ఆ తరువాత కాంట్రాక్టర్ గా పని చేసినట్లు చెప్పారు. భగవంతుడి ఆశీస్సులతో...

Ponguleti: నాకు రాజకీయ గాడ్ ఫాదర్ ఎవరూ లేరు.. తెలంగాణా ప్రజలే గాడ్ ఫాదర్.. పొంగులేటి కామెంట్స్..
Ponguleti Srinivas Reddy
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 10, 2023 | 3:08 PM

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చిన్న రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తినన్న ఆయన.. ఆ తరువాత కాంట్రాక్టర్ గా పని చేసినట్లు చెప్పారు. భగవంతుడి ఆశీస్సులతో ఆర్థికంగా ఎదిగినట్లు వివరించారు. డబ్బులు సంపాదించడమే కాకుండా పది మందికి ఉపయోగపడాలనేది తన ఉద్దేశ్యమన్నారు. తన నియోజక వర్గ పరిధిలో లేకపోయినా ఎప్పటి నుండో పినపాకతో సన్నిహితంగా ఉన్నానని.. కానీ కొందరు ఇప్పుడు ఇక్కడ ఏం పని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రజల కోసం, కష్ట సుఖాలు తెలుసుకునేందుకు వస్తున్నట్లు.. నాడు కేసీఆర్ , కేటీఆర్ పిలుపుతో పార్టీలో చేరినట్లు తెలిపారు. కానీ గత నాలుగు సంవత్సరాలుగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయని, కేటీఆర్ తో సాన్నిహిత్యంతో అవమానాలు జరుగుతున్నా ఓపిక పట్టామని చెప్పారు. తనతో పాటు, తనతో ఉన్న వాళ్లకు కనీస గౌరవం ఇవ్వలేదని కామెంట్ చేశారు. నాకు రాజకీయ గాడ్ ఫాదర్ ఎవరూ లేరు.. తెలంగాణా ప్రజలే గాడ్ ఫాదర్ అని స్పష్టం చేశారు.

నేను ప్రజల ను ఆదరించేందుకు వెళితే దాన్ని కూడా మరో కోణంలో చూశారు. మీకు మంచి చేయడం రాదు. చేసే వాళ్లను అడ్డుకుంటారు. నేను ఈ రోజు గంగిరెద్దు లా రాలె. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నేను ప్రజల్లో ఉన్నా. నేను సెక్యూరిటీ అడగలేదు. ఉన్న సెక్యూరిటీని తగ్గించిన నాకు ఇబ్బంది లేదు. నేను ఏమి అరాచకాలు చేయలేదు.

            – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఇవి కూడా చదవండి

గతంలోనూ ఆయన ఇలాంటి కామెంట్లే చేశారు. చేపలు నీళ్ళల్లో ఉండటం సర్వసాధరణమన్న ఆయన.. నీళ్ళల్లో ఉండే చేప బయటకు వస్తే బతకదన్నట్లు.. రాజకీయ నాయకుడు ప్రజల్లో ఉన్ననాడే, వారితో మమేకమై, అభిమానం పొందిననప్పుడే నాయకుడిగా రాణించగలుగుతాడన్నారు. నాలుగున్నర ఏళ్లలో ఏ పదవి లేకపోయినా, జనం నుంచి అపూర్వ స్పందన వచ్చిందంటూ పొంగులేటి కామెంట్స్‌ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..