Lockdown: తెలంగాణలో మొదలైన లాక్‌డౌన్… నిర్మల్ జిల్లాలో ఎలా ఉందో తెలుసుకున్న మంత్రి

Lockdown in Nirmal City; తెలంగాణలో లాక్‌డౌన్ మొదలైంది. లాక్‌డౌన్ సడలింపు ముగియడంతో ఈ ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో షాపులు మూతపడ్డాయి.

Lockdown: తెలంగాణలో మొదలైన లాక్‌డౌన్... నిర్మల్ జిల్లాలో ఎలా ఉందో తెలుసుకున్న మంత్రి
Lockdown Nirmal
Follow us

| Edited By: Team Veegam

Updated on: May 12, 2021 | 11:26 PM

తెలంగాణలో లాక్‌డౌన్ మొదలైంది. లాక్‌డౌన్ సడలింపు ముగియడంతో ఈ ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో షాపులు మూతపడ్డాయి. ఇతర కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇక కరోన వైరస్ కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ అమలు తీరును అటవీ, పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. బుధవారం నిర్మల్‌ పట్టణంలో లాక్‌డౌన్‌, ప్రభుత్వం సడలింపు ఏవిధంగా అమలవుతున్నాయో ఆయన అధికారులతో కలిసి పర్యవేక్షించారు. వర్తకులు, చిరువ్యాపారుల ను కలిసి ప్రజలు నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

ఈ సమయంలో లాక్ డౌన్ నియమాలు అమలు పరచటంలో భాగంగా, రోడ్లపై విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచిస్తూ లాక్ డౌన్ నియమాలు కఠినంగా అమలు చేయాలన్నారు.

ప్రజలు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని.., ఒకవేళ తప్పనిసరిగా బయటకు రావాల్సిన పరిస్థితి వస్తే చేతికి గ్లౌజులు ధరిస్తూ, ముఖానికి తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలని, సామాజిక దూరం పాటిస్తూ, తమ కావలసిన వస్తువులు తీసుకుని వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని తెలుపుతూ, లాక్ డౌన్ నియమాలు అమలు పరచడంలో పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరారు.

అనంతరం నిర్మల్ పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కూడా పరిశీలించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెంట మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, పోలీస్, ఇతర శాఖ అధికారులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి : Viral: ప్రియుడు మోసం.. ప్రియురాలు చేసిన పని తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.!

Movies In OTT: వినోదాల పండగ మళ్లీ షూరు.. ఈసారి ఓటీటీలో అలరించనున్న సినిమాలు ఇవే..

Covid-19: నెల అయింది.. కోలుకున్నా బెడ్లు ఖాళీ చేయరా..? కరోనా రోగులపై సీఎం ఆగ్రహం..

Basara Saraswati Temple: బాసర సరస్వతీ క్షేత్రంలో అపచారం అంటూ తప్పుడు ప్రచారం.. ఆలయ అధికారుల వివరణ..