Viral: ప్రియుడు మోసం.. ప్రియురాలు చేసిన పని తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.!

సాధారణంగా ప్రేమలో పడిన యువకులు తమను ప్రియురాలు మోసం చేస్తే అబ్బాయిలు అస్సలు ఊరుకోరు. అలానే....

Viral: ప్రియుడు మోసం.. ప్రియురాలు చేసిన పని తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.!
Cheat Boy Friend
Follow us
Ravi Kiran

|

Updated on: May 12, 2021 | 12:44 PM

Cheating Boyfriend Funeral: సాధారణంగా ప్రేమలో పడిన యువకులు తమను ప్రియురాలు మోసం చేస్తే అబ్బాయిలు అస్సలు ఊరుకోరు. అలానే, అప్పుడప్పుడూ అమ్మాయిలు కూడా అబ్బాయిలకి ఝలక్ ఇస్తుంటారు. తనను మోసం చేసిన ప్రియుడికి ఓ యువతి ఊహించని షాకిచ్చింది. అతడిని జైల్లో పెట్టించింది…అంతటితో ఆగలేదు..అతడు చనిపోయినట్లు అందరినీ నమ్మించి ఏకంగా అంత్యక్రియలే చేసేసింది. తన కథను సోషల్‌మీడియాతో పంచుకున్న సదరు యువతిని అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

థేయా లోవరిడ్జ్ అనే మహిళ ఓ వ్యక్తిని మూడేళ్లుగా ప్రేమిస్తుంది. పెళ్లి కాకుండా ఇద్దరూ కొంతకాలంగా కలిసుంటారు..ఈ క్రమంలోనే థేయా గర్భం దాల్చింది. ఆ సమయంలో ఆమె బాయ్‌ఫ్రెండ్ మరో యువతిని ప్రేమించి ఆమెతో ఎంజాయ్ చేయసాగాడు. ఈ విషయం తెలుసుకున్న థేయా తనను దారుణంగా మోసం చేసిన ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. ఇందుకోసం పక్కా ప్లాన్ సిద్ధం చేసుకుంది. అందుకు తన ప్రియుడి చెల్లెలి సాయం కూడా తీసుకుంది.

ముందుగా థేయా తన ప్రియుడి మీద పోలీసులకు ఫిర్యాదు చేసి జైలుకు పంపింది. ఈ విషయం తెలియని కొత్త ప్రియురాలు అతడికి ఎన్నోసార్లు కాల్స్, మెసేజ్‌లు చేసినా రిప్లై రాలేదు. కొద్దిరోజుల తర్వాత ఆమెకు ఫోన్ చేసిన థేయా..నీ బాయ్‌ఫ్రెండ్ చనిపోయాడు, ఈరోజు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం అని చెప్పింది. ఆమెను నమ్మించేందుకు ఉత్తుత్తి అంత్యక్రియలు నిర్వహించి ఆ వీడియోను పంపించింది. ఈ ఘటన జరిగి మూడేళ్లైంది. తన ప్రియుడు నిజంగానే చనిపోయాడనుకున్న ఆ యువతి ఏటా అతడి సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పిస్తోంది. ఈ విషయాన్ని ఇటీవలే థేయా తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. నిన్ను మోసం చేసిన వాడికి తగిన బుద్ధి చెప్పావంటూ నెటిజన్లు థేయాను ప్రశంసిస్తున్నారు.

Also Read:

హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు.. ఏం చేయాలి.? ఏం చేయకూడదు.?

ఐపీఎల్ వాయిదా.. పలు ఫ్రాంచైజీలకు లాభం.. ఆ ఐదుగురు ప్లేయర్ల పునరాగమనం.!

Viral Video: ద్యావుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..!

భారీ నాగపామును పట్టి బరాబరా ఈడ్చుకెళ్లిన బామ్మ.. నెటిజన్లు ఫిదా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!