Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Movies In OTT: వినోదాల పండగ మళ్లీ షూరు.. ఈసారి ఓటీటీలో అలరించనున్న సినిమాలు ఇవే..

కరోనా సెకండ్ వేవ్.. మరోసారి థియేటర్లకు తాళం పడేలా చేసింది. గతేడాది లాక్ డౌన్ కారణంగా మూతపడిన థియేటర్లు.. ఇటీవలే తెరుచుకొని

Movies In OTT: వినోదాల పండగ మళ్లీ షూరు.. ఈసారి ఓటీటీలో అలరించనున్న సినిమాలు ఇవే..
Ott
Follow us
Rajitha Chanti

|

Updated on: May 12, 2021 | 12:34 PM

కరోనా సెకండ్ వేవ్.. మరోసారి థియేటర్లకు తాళం పడేలా చేసింది. గతేడాది లాక్ డౌన్ కారణంగా మూతపడిన థియేటర్లు.. ఇటీవలే తెరుచుకొని ప్రేక్షకులను కనువిందు చేశాయి. దీంతో పలు సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకొని ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఈ క్రమంలోనే చిన్న సినిమాల నుంచి బడా హీరోల సినిమాల వరకు ప్రతి ఒక్కరు తమ తమ సినిమా విడుదల తేదీలను ప్రకటించేశారు. ఇక ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా వెండితెర వినోదాలకు మరోమారు కళ్లెం పడింది. దాదాపు మూడు నెలలు తెరుచుకున్న థియేటర్లన్నీ మళ్లీ మూతపడిపోయాయి. దీంతో ఓటీటీ వేదికల వైపు సినీ ప్రియులు మొగ్గు చూపుతున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన సినిమాలు చేసేదేమి లేక ఓటీటీలను ఆశ్రయిస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు ఆయా ఓటీటీ సంస్థలతో డీల్ కుదుర్చుకున్నాయి. మరీ ఇప్పుడు ఏ ఏ సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నయో తెలుసుకుందామా.

Battala Ramaswamy Biopic

Battala Ramaswamy Biopic

బట్టల రామస్వామి బయోపిక్కు..

డైరెక్టర్ రామ్ నారాయణ్ దర్శకత్వంలో అల్తాఫ్ హాసన్, శాంతి రావు, సాత్విక, లావణ్య రెడ్డి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం బట్టల రామస్వామి బయోపిక్కు. ఈ సినిమాను సెవెన్ హిల్స్ సతీష్ కుమార్, ఐ మ్యాంగో మీడియా రామకృష్ణ వీరపనేని నిర్మాతలుగా వ్యవహరించారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించిన ఈ సినిమా జీ5లో మే 14న నుంచి స్ట్రీమింగ్ కానుంది.

November Story

November Story

నవంబర్ స్టోరీ..

మిల్కీబ్యూటీ తమన్నా.. అటు సినిమాల్లోనూ.. ఇటు వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇటీవలే లెవెన్త్ అవర్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. ఇప్పుడు రెండవ చిత్రం నవంబర్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తండ్రి హత్య కేసులో ఇరుక్కుంటే.. ఆయన్ను, ఆయన ప్రతిష్ఠను కాపాడుకునే కూతురు పాత్రలో తమన్నా నటించింది. ఈ సిరీస్ కు ఇంద్ర సుబ్రమణియన్‌ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ ఈనెల 20న డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ప్రసారం కానుంది.

Thank You Brother

Thank You Brother

థ్యాంక్ యు బ్రదర్..

ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా థ్యాంక్‌ యు బ్రదర్‌. అయితే ఈ సినిమాను ముందుగా ఏప్రిల్‌ 30న థియేటర్లలో రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ కరోనా సంక్షోభంతో థియేటర్లు మూతపడగా… ఓటీటీ వేదిక ఆహాలో మే 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

D Company

D Company

డీ కంపెనీ..

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం డీ కంపెనీ. దావూద్‌ ఇబ్రహీం జీవితకథ ఆధారంగా ఈ మూవీ రూపొందగా.. అష్వత్‌ కాంత్‌, ఇ‍ర్రా మోహన్‌, నైనా గంగూలీ, రుద్రకాంత్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మే 15న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ స్పార్క్‌లో విడుదల కానుంది.

Cinema Bandi

Cinema Bandi

సినిమా బండి..

వెరైటీ టైటిల్‌తో తెరకెక్కిన చిత్రం సినిమా బండి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాతో ప్రవీణ్‌ కండ్రిగుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సినిమా బండిని నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసింది. మే 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా బండి ప్రసారం కానుంది.

Also Read: Allu Arjun: బన్నీ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. కరోనాను జయించిన అల్లు అర్జున్.. అఫీషియల్ ట్వీట్..

రాజ్‌తరుణ్‌ని జైలుకి పంపిస్తా.. లావణ్య
రాజ్‌తరుణ్‌ని జైలుకి పంపిస్తా.. లావణ్య
ఆ రెండు యాక్టివా స్కూటర్స్‌పై ఆఫర్ల జాతర..!
ఆ రెండు యాక్టివా స్కూటర్స్‌పై ఆఫర్ల జాతర..!
ముక్కు మీద వైట్ హెడ్స్ తోని ఇబ్బంది పడుతున్నారా..?
ముక్కు మీద వైట్ హెడ్స్ తోని ఇబ్బంది పడుతున్నారా..?
రోజంతా ఎండలోనే తిరుగుతున్నారా.. ఈ వ్యాధుల రిస్క్ మీకే ఎక్కువ
రోజంతా ఎండలోనే తిరుగుతున్నారా.. ఈ వ్యాధుల రిస్క్ మీకే ఎక్కువ
లావుగా ఉన్నావ్.. అందంగా లేవంటూ రిజెక్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్
లావుగా ఉన్నావ్.. అందంగా లేవంటూ రిజెక్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్
డేంజర్‌లో వాట్సాప్ యూజర్లు.. ఆ ఫొటోలను ఓపెన్ చేస్తే ఖాతా ఖాళీ..!
డేంజర్‌లో వాట్సాప్ యూజర్లు.. ఆ ఫొటోలను ఓపెన్ చేస్తే ఖాతా ఖాళీ..!
ఎవడ్రా ఆపేది అంటూ పాత రికార్డులను బద్దలు కొడుతున్న బంగారం ధర
ఎవడ్రా ఆపేది అంటూ పాత రికార్డులను బద్దలు కొడుతున్న బంగారం ధర
ఈ ఆకును ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో తినండి.. ఆరోగ్యంలో అద్భుతాలు
ఈ ఆకును ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో తినండి.. ఆరోగ్యంలో అద్భుతాలు
వీడెవడ్రా ఇట్లా ఉన్నాడు.. మహిళలను వేధిస్తూ సంతోషపడే మృగాడు..
వీడెవడ్రా ఇట్లా ఉన్నాడు.. మహిళలను వేధిస్తూ సంతోషపడే మృగాడు..
కాశ్మీర్‌పై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు
కాశ్మీర్‌పై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు