Allu Arjun: బన్నీ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. కరోనాను జయించిన అల్లు అర్జున్.. అఫీషియల్ ట్వీట్..

Allu Arjun: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన అభిమానులకు శుభ వార్త అందించారు.

Allu Arjun: బన్నీ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. కరోనాను జయించిన అల్లు అర్జున్.. అఫీషియల్ ట్వీట్..
Allu Arjun
Follow us
Rajitha Chanti

|

Updated on: May 12, 2021 | 12:26 PM

Allu Arjun: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన అభిమానులకు శుభ వార్త అందించారు. తాజాగా జరిపిన పరీక్షలలో కరోనా నెగిటివ్ వచ్చినందని ఆయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఈ మేరకు బన్నీ తన ఇన్ స్టా ఖాతాలో.. “అందరికి హాయ్.. 15 రోజుల క్వారంటైన్ అనంతరం.. ఇప్పుడు జరిపిన టెస్టులలో కరోనా నెగిటివ్ గా వచ్చింది. నాకోసం ప్రార్థించిన అభిమానులకు, సన్నిహితులకు ధన్యవాదాలు. కరోనా కేసులు తగ్గడానికి ఈ లాక్ డౌన్ పనిచేస్తుందని నమ్ముతున్నాను. బీ హోం. బీ సేఫ్.. అంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్.

ట్వీట్..

ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల క్రితం బన్నీ తన ఆరోగ్య పరిస్థితి గురించి ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలే ఉన్నాయి.. కానీ ఇప్పుడు అంతా బాగానే ఉంది.. కరోనా నుంచి కోలుకుంటున్నాను.. ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నాను.. మీరు చూపిస్తున్న ప్రేమకు, ప్రార్థనలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను’ అని పోస్ట్ చేశాడు అల్లు అర్జున్. కరోనా సమయంలోనూ ఎలాంటి విరామం తీసుకోకుండా పుష్ప సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పుష్ప సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక దాదాపు పదిహేను రోజులు పిల్లలకు దూరంగా ఉన్న అల్లు అర్జున్.. ఇప్పుడు వారి చెంతకు చేరాడు. అయాన్, అర్హలతో కలిసి అల్లరి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వీడియో..

Also Read: నేను విసిగిపోయాను.. ఇలాంటి రూమర్స్ గురించి ఏం చెప్పాలో తెలియడంలేదు.. మరణవార్తలపై స్పందించిన శక్తిమాన్ నటుడు..

కోవిడ్ కష్టాల్లో అండగా రేణు దేశాయ్.. అవసరంలో ఉన్న వాళ్ల డీటెయిల్స్ పంపితే సాయం చేస్తా అంటూ..

Kiara Advani: మరోసారి టాలీవుడ్ వైపు అడుగులేస్తున్న ముద్దుగుమ్మ.. ఆ సినిమాలో సెలక్ట్ అయ్యిందా…