‘Jersey’ Hindi Remake: ఓటీటీ వేదికగా విడుదలకు సిద్దమవుతున్న బాలీవుడ్ ‘జర్సీ’…

టాలీవుడ్ సినిమాల పై బాలీవుడ్ నటులు దర్శకులు మోజుపడుతున్నారు. ఇప్పటికే చాలామంది తెలుగు సినిమాలు చాలా హిందీలో రీమేక్ అయ్యాయి.

'Jersey' Hindi Remake: ఓటీటీ వేదికగా విడుదలకు సిద్దమవుతున్న బాలీవుడ్ 'జర్సీ'...
Follow us
Rajeev Rayala

|

Updated on: May 11, 2021 | 10:15 PM

‘Jersey’ Hindi Remake:

టాలీవుడ్ సినిమాల పై బాలీవుడ్ నటులు దర్శకులు మోజుపడుతున్నారు. ఇప్పటికే చాలామంది తెలుగు సినిమాలు చాలా హిందీలో రీమేక్ అయ్యాయి. ఇటీవల అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ అయ్యి సంచలన హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ కోవలోకే  ‘జెర్సీ’ సినిమా వస్తుంది. ధర్మ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహార్‌ ఈ సినిమాను రీమేక్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ను ఎంపికచేసుకోవాలని కరణ్‌ భావిస్తున్నారట. అయితే ‘కబీర్‌ సింగ్’ విజయంతో జోరు మీదున్న షాహిద్‌ ‘జెర్సీ’ రీమేక్‌లో నటించేందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.40 కోట్లు డిమాండ్‌ చేసినట్లు బాలీవుడ్‌ వర్గాల భోగట్టా. షాహిద్‌ ఇందుకు అర్హుడేనని భావించిన కరణ్‌ కూడా ఆయన అడిగినంత పారితోషికం ఇవ్వడానికి ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవలే షాహిద్ హీరోగా  ‘అర్జున్‌రెడ్డి’కి రీమేక్‌గా బాలీవుడ్‌లో వచ్చిన ‘కబీర్‌ సింగ్‌’ దాదాపు రూ.300 కోట్లు కొల్లగొట్టింది. హిందీ ‘జెర్సీ’ చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు లేటెస్టుగా ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని బీ టౌన్ వర్గాలు అంటున్నాయి.

కోవిడ్ నేపథ్యంలో బాలీవుడ్ మార్కెట్ పూర్తిగా దెబ్బతినింది. కరోనా ఫస్ట్ వేవ్ నుంచి బయటపడి టాలీవుడ్ లో సినిమాలు రిలీజ్ చేసినప్పుడు కూడా అక్కడ కొత్త చిత్రాలు రిలీజ్ చేయడానికి సంకోచించారు. ఇప్పుడు సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని హిందీ ‘జెర్సీ’ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా రైట్స్ ని దక్కించుకోడానికి జీ స్టూడియో వారు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని ఇక్కడ చదవండి :

Thalapathy Vijay: దళపతి విజయ్ తో దిల్ రాజు సినిమా..మాస్టర్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..

Actress Pooja Hegde: పవర్ స్టార్ ను ఫాలో అవుతున్న బుట్టబొమ్మ పూజా.. ఏం చేసిందో తెలుసా…