Minister Harish Rao: బీఆర్ఎస్ అంటే అభివృద్ధి.. బీజేపీ అంటే అధోగతి.. మంత్రి హరీష్ రావు ఫైర్
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత తెలంగాణ ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన నీటిని తాగేందుకు అవకాశం లభించిందన్నారు మంత్రి హరీష్ రావు. గతంలో పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలు కలుషిత నీరు తాగి ఆరోగ్య సమస్యలతో చనిపోయే పరిస్థుతులు ఉండేవన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత తెలంగాణ ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన నీటిని తాగేందుకు అవకాశం లభించిందన్నారు మంత్రి హరీష్ రావు. గతంలో పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలు కలుషిత నీరు తాగి ఆరోగ్య సమస్యలతో చనిపోయే పరిస్థుతులు ఉండేవన్నారు. 400 ఎకరాల్లో ఐటీ పార్కు పటాన్ చెరులో రాబోతున్నందన్నారు. గత ప్రభుత్వాలు పేద ప్రజల కళ్లల్లో నీళ్లు రప్పిస్తే.. నేటి టీఆర్ఎస్ ప్రభుత్వం శుద్ధమైన నీళ్లు తాగిస్తుందన్నారు. బీఆర్ఎస్ అంటే అభివృద్ధి.. బీజేపీ అంటే అదోగతి అంటూ హరీష్ రావు వ్యాఖ్యనించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సంపద పెంచింది.. ప్రజలకు పెంచిందన్నారు. 250 కోట్ల రూపాయలతో త్వరలో పటాన్ చెరులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కూడా త్వరలో రాబోతుందన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం వికలాంగులకు 3 వేల రూపాయల పించన్ ఇస్తూ అందుకుంటుందన్నారు. తెలంగాణలో నాడు ఉన్న కరెంటు కష్టాలు నేడు లేవన్నారు మంత్రి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మైత్రి గ్రౌండ్స్‌లో స్ధానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 215 మంది దివ్యాంగులకు ద్విచక్ర వాహనాల పంపిణీ చేశారు మంత్రి. వికలాంగులకు వాహనాలు అందించి వారిలో ధైర్యం నింపుతున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అభినందనీయులు అంటూ హరీష్ రావు కొనియాడారు. 20 కోట్ల రూపాయలతో పాత పైప్ లైన్ల స్ధానంలో కొత్త పైప్ లైన్ పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..