Minister Harish Rao: ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే మ్యానిఫెస్టో రాబోతుంది.. మంత్రి హరీష్ రావు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 60 ఏళ్ల కాంగ్రెస్. టీడీపీ పాలనలో రాజకీయ నాయకుల డ్రామాలు తప్ప ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చుక్క నీళ్లు రాలేదని హరీష్ రావు అన్నారు. కల్వకుర్తికి నీళ్లు తీసుకురావడం బీఆర్ఎల్ ప్రభుత్వం వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందుకు పార్టీ వీడినటువంటి నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 60 ఏళ్ల కాంగ్రెస్. టీడీపీ పాలనలో రాజకీయ నాయకుల డ్రామాలు తప్ప ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చుక్క నీళ్లు రాలేదని హరీష్ రావు అన్నారు. కల్వకుర్తికి నీళ్లు తీసుకురావడం బీఆర్ఎల్ ప్రభుత్వం వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందుకు పార్టీ వీడినటువంటి నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రజలకు 24 గంటల కరెంటు ఇచ్చింది 2వేల రూపాయల ఆసరా పెన్షన్ సహా అనేక సంక్షేమ పథకాలు అమలుచేసిందని.. అలాగే కల్వకుర్తిలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీనే అని అన్నాపు. ట్రాన్స్‌ఫార్మర్ కాలకుండా, ఒక్క పంటైన కాంగ్రెస్ హయంలో పండిందా అంటూ ప్రశ్నించారు.
ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదని అన్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతులకు రైతు బీమా ప్రభుత్వం అమలవుతుందా అని ప్రశ్నించారు. అలాగే కేసీఆర్ పాలనలో పల్లె దావాఖన, బస్తీ దవాఖాన నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి.. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టి వైద్యం అందరికీ అందేలా చేశారని అన్నారు. అలాగే త్వరలో బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల కానుందని.. అన్ని వర్గాలు సంతోషించే విధంగా ఈ మేనిఫెస్టో ఉండనుందని చెప్పారు. అయితే తెలంగాణలో అమలు చేస్తున్నువంటి రైతు సంక్షేమ పథకాలను తమ రాష్ట్రాల్లో అమలు చేయాలని కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు అక్కడి నాయకులను, ప్రభుత్వాలను నిలదీస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా మ్యానిఫెస్టో ఉండనుందని అన్నారు. మరోవైపు రైతులకు అన్ని వర్గాలకు ఏం చేస్తే బాగుంటుందనే అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మేధావులతో, అధికారులతో చర్చలు జరుపుతున్నారని అన్నారు.
కల్వకుర్తిలో లక్షా యాభై వేల ఎకరాల్లో రెండు పంటలు పండే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు నీళ్లు అందిస్తామని పేర్కొన్నారు. ఒక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయమంటే 10 ఏళ్లుగా బీజేపీ అడ్డుపడుతుందని వ్యాఖ్యానించారు. అలాగే 9 ఏళ్లుగా గిరిజన యూనివర్సిటీ రాకుండా అడ్డుపడ్డ బీజేపీ ఇప్పుడు ఎన్నికల కోసం ప్రకటించిందని పేర్కొన్నారు. అలాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఇలా అనేక విభజన హామీలను బీజేపీ విస్మరించిందని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే మన కంట్లో మనమే వేలు పెట్టి పొడుచుకున్నట్లని.. మన అభివృద్ధిని మనమే అడ్డుకున్నట్లని అన్నారు.అలాగే ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా కూడా మళ్ళీ గెలిచేది హ్యాట్రిక్ కొట్టేది కేసీఆరే అని అన్నారు. అలాగే కల్వకుర్తి అభివృద్ధికి కూడా మరిన్ని నిధులను మంజూరు చేస్తామని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేక ఇక్కడి నాయకులను తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




