AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: ఎన్నికల వేళ తెలంగాణలో ప్రధాని పర్యటన.. పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం

Telangana: తెలంగాణలో ఎన్నికల సమరం అప్పుడే మొదలైంది. ఈ పొలిటికల్ పోరులో అధికార బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుగానే ఉంది. ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయగా.. అభ్యర్థులంతా తమ తమ నియోజకవర్గాల్లో గెలవడానికి అవసరమైన సన్నాహాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Telangana BJP: ఎన్నికల వేళ తెలంగాణలో ప్రధాని పర్యటన.. పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం
BJP
Shiva Prajapati
|

Updated on: Oct 02, 2023 | 5:27 AM

Share

Telangana: తెలంగాణలో ఎన్నికల సమరం అప్పుడే మొదలైంది. ఈ పొలిటికల్ పోరులో అధికార బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుగానే ఉంది. ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయగా.. అభ్యర్థులంతా తమ తమ నియోజకవర్గాల్లో గెలవడానికి అవసరమైన సన్నాహాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక మొన్నటి వరకు ఫుల్ స్వింగ్‌లో ఉన్న బీజేపీ.. కాస్త దూకుడు తగ్గించింది. ఈ గ్యాప్‌లో కాంగ్రెస్ కాస్త హడావుడి చేసింది. బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ ఢంకా బజాయించింది. కాంగ్రెస్ నేతల దూకుడు, ఆ పార్టీలో చేరికల పరంపర కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో మళ్లీ బీజేపీలో జోష్ నింపేందుకు తెలంగాణలోకి అడుగుపెట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. మరి ఆయన రాకతో బీజేపీలో ఛేంజ్ కనిపిస్తుందా? పార్టీ శ్రేణుల్లో ఆయన మునుపటి జోష్ నింపుతారా? అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

అసలు బీజేపీకి గేమ్ స్ట్రాటజీ ఏమిటి?

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ఎప్పుడైతే కాంగ్రెస్ గెలిచిందో.. ఆ గెలుపు ఎఫెక్ట్ తెలంగాణలోని బీజేపీ పైనా పడింది. కర్నాటకలో బీజేపీ అధికారం కోల్పోవడంతో బీజేపీ నేతలు కాస్త డల్ అయ్యారు. అదే సమయంలో నేతల మధ్య విభేదాలు వెలుగుచూశాయి. ఇది పార్టీ దూకుడును తగ్గించింది. క్షేత్రస్థాయిలో కేడర్ కూడా వేచి చూసే ధోరణినే అవలంభించింది. తమను పట్టించుకోవడం లేదంటూ సీనియర్ల అలకలతో.. పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాంతో రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అయినా కొందరు నేతల తీరు మారలేదు. దీంతో తెలంగాణా బీజేపీలో కీలక మార్పులు చేసింది హైకమాండ్. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను తప్పించి.. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించింది. సీనియర్ నాయకుడు, సౌమ్యుడు, అందరినీ కలుపుకొనిపోయే తత్వం గల వ్యక్తి అనే కారణంగా కిషన్ రెడ్డికే రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను అప్పగించింది పార్టీ. కానీ పార్టీలో అలకలు, అసంతృప్తులు కొంతమేర కొనసాగాయి. ఇటీవలి కాలంలో బీజేపీలోని పలువురు సీనియర్ నేతలు చేస్తున్న కామెంట్సే ఇందుకు నిదర్శనం.

ఇవి కూడా చదవండి

ఎన్నికల ముంగిట..

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఓ వారం పది రోజుల్లో రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి తరుణంలో ఐకమత్యంగా ఉంటూ ఎన్నికల సమరానికి సన్నద్ధం కావాల్సి ఉంది. అయినా ఆ జోష్ కొంతమేర కనిపించడం లేదు. అసంతృప్తులు, అలకలు ఇంకా కొనసాగడంతో.. క్యాడర్ నిరుత్సాహం పడకుండా పార్టీ అధిష్టానం మోడీ మంత్రం ప్రయోగించింది. అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి తనవంతు ప్రయత్నాలు తాను చేస్తున్నప్పటికీ.. మిగతా నేతలు మునుపటిలా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఓవైపు అధికారం తమదే అంటూ.. మరోవైపు ఎవరంతట వారు ఉంటే ఎన్నికల సమరంలో పోరాడేదెలా? గెలిచేదెలా? అందుకే ఇప్పుడు మోడీ మంత్రాన్ని ప్రయోగించారు.

రంగంలోకి పార్టీ హైకమాండ్..

దక్షిణాదిన తిష్ట వెయ్యాలంటే తెలంగాణాయే సరైన వేదిక అని బీజేపీ అధినాయకత్వం మొదటి నుంచి భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. తొలి నుంచి పార్టీ అగ్రనేతల గురి తెలంగాణపైనే ఉంది. అవసరమైన ప్రతిసారీ బీజేపీ పెద్దలు తెలంగాణలో పర్యటిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. అయినా అనుకున్న మైలేజీ రాలేదనే భావనలో ఉంది. అందుకే ఇక లాభం లేదనుకుని అధిష్టానమే నేరుంగా రంగంలోకి దిగింది. పార్టీ వ్యవహారాలన్నీంటిని చక్కబెట్టి, ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు లోకల్ లీడర్స్‌కి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తోంది. ఇందులో భాగంగానే.. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన చేపట్టారు. ఒక్క రోజు వ్యవధిలోనే తెలంగాణలో రెండు చోట్ల పర్యటనలు పెట్టుకున్నారు. మహబూబ్‌నగర్ సభ ఇప్పటికే ముగిసింది. ఒక రోజు తరువాత అంటే ఆక్టోబర్ 3న నిజామాబాద్‌లో పర్యటించనున్నారు.

ప్రధాని మోదీ ప్రసంగంతో.. బీజేపీ దూసుకుపోతుందా?

అభివృద్ధి పనులకు శంకుస్థాపన పేరుతో తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. అసలు లక్ష్యాన్ని నేరుగా చెప్పేశారు. పాలమూరు వేదికగా తెలంగాణలో ఎన్నికల సమరశంఖం పూరించారు. మొదట అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలను తన కుటుంబ సభ్యులుగా ఓన్ చేసుకుంటూ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించారు. రాష్ట్ర ప్రజల అంతరంగాన్ని గుర్తించిన ప్రధాని.. ఆ దిశగా హామీలు జల్లు కురిపించారు. పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థాయి పెంపుపై కీలక ప్రకటన చేశారు. ఇక ఈ సభ తరువాత జరిగిన మరో సభలో మనసు విప్పి మాట్లాడుతాను అంటూ.. నేరుగా పొలిటికల్ బాణాలు సంధించారు. కరప్షన్, కమీషన్లకు కేరాఫ్ అంటూ తమ ప్రత్యర్థులైన రెండు పార్టీలకు చురకలంటించారు. కారు స్టీరింగ్‌ పైనా కామెంట్స్ చేశారు. ఈ కుటుంబ పార్టీలతో ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని, తెలంగాణ ప్రజల్లో రోజు రోజుకు బీజేపీకి ఆదరణ పెరుగుతోందన్నారు. తెలంగాణ అభివృద్ధిని ఆ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తూనే.. రాష్ట్రాభివృద్ధికి తామున్నామంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు ప్రధాని మోదీ. ఈ కుటుంబ పార్టీలను గద్దె దించాలని, బీజేపీని గెలిపించాలని కోరారు.

ఇదిలాఉంటే.. మోదీ స్పీచ్‌ ఆరంభం మొదలు.. ఎండింగ్ వరకు బీజేపీ శ్రేణులు కేరింతలతో హోరెత్తించారు. మోదీ మోదీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే సభకు వచ్చిన పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్ కనిపించింది. ఇదే జోష్ క్షేత్ర స్థాయిలో ఉంటుందా? ఎన్నికల వరకు ఇలాగే కంటిన్యూ అవుతుందా? పాలమూరు వేదికగా సమరశంఖం పూరించిన మోదీ.. నిజామాబాద్ వేదికగా ఇంకే మాట్లాడుతారు? అక్కడెలాంటి కామెంట్స్ చేస్తారు? అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..