AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉచిత విద్యుత్‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకోండి.. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలన్న మంత్రి గంగుల

Free Electricity: తెలంగాణ రాష్ట్రంలోని సెలూన్లు, దోబీఘాట్లు, లాండ్రీల నిర్వ‌హ‌కులు ఉచిత విద్యుత్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు. నెల‌కు 250 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్‌కు...

ఉచిత విద్యుత్‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకోండి.. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలన్న మంత్రి గంగుల
Gangula
Sanjay Kasula
|

Updated on: May 30, 2021 | 12:53 AM

Share

తెలంగాణ రాష్ట్రంలోని సెలూన్లు, దోబీఘాట్లు, లాండ్రీల నిర్వ‌హ‌కులు ఉచిత విద్యుత్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు. నెల‌కు 250 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్‌కు సంబంధించి  జూన్ 1 నుంచి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని చెప్పారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2 ల‌క్ష‌ల ర‌జ‌క‌, 70 వేల నాయీ బ్ర‌హ్మ‌ణ కుటుంబాల‌కు ల‌బ్ధి చేకూరుతుంద‌ని మంత్రి వివ‌రించారు. ఉచిత విద్యుత్ ద‌ర‌ఖాస్తు త‌దిత‌రాల విష‌యంలో ద‌ళారుల‌ను నమ్మి మోస‌పోవ‌ద్ద‌ని సూచించారు. జూన్ 1 నుంచి 30 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌నున్న‌ట్లు గంగుల తెలిపారు.

ఈ పథకం ద్వారా రాష్టవ్యాప్తంగా ఉన్న 2 లక్షల రజక కుటుంబాలకు చెందిన లాండ్రీ షాపులకు, దోబీఘాట్లకు. నాయీభ్రాహ్మణ సోదరులకు చెందిన 70 వేల సెలూన్ల లబ్దీ చేకూరుతుందని వివరించారు. ఇందుకోసం అవసరమైన 250 యూనిట్ల కరెంటు రాయితీని ప్రతీ నెల ప్రభుత్వం వారికి జమ చేస్తుందని చెప్పారు. ఈ సదుపాయాలు పూర్తిగా ఆన్లైన్లో పారదర్శకంగా ఉంటాయని, ఎవరూ దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు ఆయన సూచించారు.

www.tsobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో లబ్దీదారులు స్వంతంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో వ్యక్తిగత వివరాలు, షాపు వివరాలు, అప్‌లోడు వంటి మూడు ప్రధాన విభాగాలుగా ఉండే ఈ అన్లైన్ అప్లికేషన్‌లో పేరు, జెండర్, మెబైల్, ఆదార్ నెంబర్లు, కుల ద్రువీకరణ పత్రం, ఉపకులము, యూనిట్ పేరు, యూనిట్ చిరునామాతో పాటు తన పేరు లేదా అద్దే నివాసానికి చెందిన కమర్షియల్ ఎలక్ట్రికల్ వినియోగదారుల కరెంట్ మీటర్ నెంబర్ వంటి వివరాలతోపాటు గ్రామపంచాయితీలు, మున్సిపాలిటీ, కార్పోరేషన్లకు చెందిన కార్మిక లేదా వాణిజ్య లైసెన్స్ లను అప్‌లోడ్ చేసి స్వీయ ద్రువీకరణతో అన్‌లైన్ అప్లికేషన్ అందజేయాల్సి ఉంటుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి: PM KISAN Yojana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. పీఎం కిసాన్‌ పథకంలో చేరేందుకు చివరి తేదీ ఎప్పుడంటే..!

Amazing Viral Video: గాలిలో ఎగురుతూన్న డేగపై చేప దాడి చేసింది… ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు…

Yuvika Chaudhary: సినీ నటిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు… నిమ్నవర్గాలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిందని ఫిర్యాదు..