Yuvika Chaudhary: సినీ నటిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు… నిమ్నవర్గాలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిందని ఫిర్యాదు..
Yuvika Chaudhary: బాలీవుడ్ నటి యువికా చౌదరీ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు హర్యానా పోలీసులు. ఇటీవల యువికా ఓ వీడియోలో నిమ్న
Yuvika Chaudhary: బాలీవుడ్ నటి యువికా చౌదరీ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు హర్యానా పోలీసులు. ఇటీవల యువికా ఓ వీడియోలో నిమ్న కులాలను విమర్శిస్తూ మాట్లాడిందని.. దళిత హక్కుల కార్యకర్త ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం సాయంత్రం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టం కింద పోలీసులు నటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఒక అధికారి తెలిపారు.
ఇటీవల నటి యువికా ఓ వీడియోలో షెడ్యూల్డ్ కుల వర్గాల గురించి కొన్ని అవమానకరమైన, అలాగే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిందని.. దళిత హక్కుల కార్యకర్త రజత్ కల్సన్ ఆరోపించారు. ఇందుకు సంబంధించి మే 26న హన్సీ పోలీసు సూపరింటెండెంట్ నికితా అహ్లవత్ కు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. అయితే ఇటీవల నటి యువికా.. ఇదే విషయం నెటిజన్లకు సారీ కూడా చెప్పింది. ఒక వర్గం వారిని కించపరిచేలా ఉన్న పదాలను పొరపాటున ఉపయోగించాను క్షమించమంటూ సోషల్ మీడియాలో వేడుకుంది. ఇక సైబర్ సెల్ ద్వారా అధికారిక దర్యాప్తు పూర్తైన తర్వాత హన్సీనగర పోలీస్ స్టేషన్లో యువికా చౌదరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టంలోని సంబంధిత విభాగం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు హన్సీ నగర పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు. ‘casteist slur’