Monoclonal Injection: కరోనా రోగులకు అందుబాటులోకి వచ్చిన మరో చికిత్స.. ఒక్క ఇంజెక్షన్‌ చాలు.. కోవిడ్‌ పరార్‌!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వైరస్ కట్టడికి మందు లేక, కనిపించని శత్రువుతో యుద్దం చేస్తోంది యావత్ ప్రపంచం. తాజాగా కోవిడ్‌ నివారణకు సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది. ‘

Monoclonal Injection: కరోనా రోగులకు అందుబాటులోకి వచ్చిన మరో చికిత్స.. ఒక్క ఇంజెక్షన్‌ చాలు.. కోవిడ్‌ పరార్‌!
Single Injection Of Monoclonal Antibodies Reduces Risk Of Symptomatic Covid 19 Infection
Follow us
Balaraju Goud

|

Updated on: May 28, 2021 | 9:07 AM

Single Injection of Monoclonal for Antibodies: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వైరస్ కట్టడికి మందు లేక, కనిపించని శత్రువుతో యుద్దం చేస్తోంది యావత్ ప్రపంచం. తాజాగా కోవిడ్‌ నివారణకు సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది. ‘మోనోక్లోనల్‌ యాంటీబాడీల’ రూపంలో ఆధునిక వైద్యం బాధితులకు భరోసానిస్తోంది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా చేసే మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స కోవిడ్‌ పాజిటివ్‌ వాళ్లకు వరంగా మారనున్నదా? అంటే అవుననే హామీ ఇస్తున్నారు వైద్యరంగ నిపుణులు. మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయని వెల్లడవడంతో.. భారత ప్రభుత్వం తాజాగా ఈ చికిత్సకు అనుమతించింది. అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న ఈ మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స ఇప్పుడు మనదేశంలో.. అదీ మన హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. హాస్పిటల్‌కి లక్షల బిల్లు లేకుండా ఒక్క ఇంజెక్షన్‌తోనే కొవిడ్‌ తీవ్రత తగ్గించే ఈ మోనోక్లోనల్‌ యాంటీబాడీల మాయాజాలం ఏంటో తెలుసుకుందామా…!

కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తిమంతమైన ఆయుధం.. యాంటీబాడీ. మొన్నటివరకూ ప్లాస్మా థెరపీ ద్వారా కోవిడ్‌కి యాంటీబాడీ చికిత్స అందించారు. అయితే, అది అంత సమర్థవంతమైనది కాదని తేలింది. ఒక ఒకే రకమైన కణాల సమూహం నుంచి తయారైనవి మోనోక్లోనల్‌ యాంటీబాడీలు. వీటిని ఉపయోగించి కోవిడ్‌కి చికిత్స చేయగలమని ఇప్పుడు నిరూపితమైంది. డయాగ్నసిస్‌, ట్రీట్‌మెంట్‌లలో అంటువ్యాధులు కాని వ్యాధుల్లో మోనోక్లోనల్‌ యాంటీబాడీలను వాడుతున్నారు. ఇప్పుడు కోవిడ్ లాంటి అంటువ్యాధికి కూడా ఇది అందుబాటులోకి వచ్చింది. అమెరికాలో 13 వేల మందిలో ఇది విజయవంతం అయింది. మనదేశంలో ఇప్పుడే ఈ చికిత్సను ప్రారంభించారు. అయితే మన దగ్గర కనిపిస్తున్న కోవిడ్‌ వేరియెంట్లపైన ఈ చికిత్స ప్రభావం ఏ మేరకు ఉంటుందో ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది. ఈ అధ్యయనం ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీలో జరుగుతోంది. కొద్దిరోజుల్లో దీని ఫలితాలు వస్తాయి.

కాగా, భారత ప్రభుత్వం తాజాగా ఈ చికిత్సకు అనుమతించింది. దేశంలో 2 లక్షల డోసులను దిగుమతి చేసుకోవడానికి ఒక ప్రైవేటు ఔషధ సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఎక్కడో అమెరికాలో అనుసరిస్తున్న చికిత్స ఇప్పుడు మన దేశంలోనే కాదు.. మన రాష్ట్రంలోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ చికిత్సను పొందడం ద్వారా 7-10 రోజుల్లో వైరస్‌ శరీరం నుంచి మటుమాయమవుతుంది. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఇవ్వడం ద్వారా ముప్పు తీవ్రత ఎక్కువ ఉన్న వారికి అధిక ప్రయోజనం చేకూరుతుందనీ, అలా అని విచ్చలవిడిగా వినియోగిస్తే ఔషధ నిల్వలకు కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉందని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ) ఛైర్మన్‌, ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. మోనోక్లోనల్‌ చికిత్స తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో గురువారం ‘జూమ్‌’ మాధ్యమం ద్వారా ఆయన విలేకరులకు ఈ చికిత్స పద్ధతుల గురించి వివరించారు.

ఏమిటీ ఈ యాంటీబాడీలుః శరీరంలో చాలా రకాల యాంటీబాడీలుంటాయి. వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేసేవి కొన్నే ఉంటాయి. అటువంటి వాటిలో ‘టసిరిబిమాబ్‌, ఇమిడెవిమాబ్‌’ అనే రెండు రకాలున్నాయి. వాటిని సేకరించి కొత్త యాంటీబాడీలను వృద్ధి చేస్తారు. ఇలా ప్రత్యేకంగా ఒకట్రెండు రకాలను మాత్రమే సేకరించి వృద్ధి చేసే విధానాన్ని మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ అంటారు. ఈ రెండూ ఇంజక్షన్ల రూపంలో లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి ఒకే మోతాదులో శరీరంలోకి ఐవీ ద్వారా ఎక్కిస్తారు. దీని ధర ప్రస్తుతం సుమారు 70వేల వరకూ ఉంటుంది. ప్లాస్మాథెరపీలో చాలా రకాల యాంటీబాడీలుంటాయి. కానీ మోనోక్లోనల్‌లో రెండే రకాలుంటాయి. 5 ఎంఎల్‌ మోనోక్లోనల్‌ యాంటీబాడీలు ఇస్తే.. 5 లీటర్ల ప్లాస్మా ఇచ్చిన దానితో సమానం.

మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స అంటే… డైరెక్ట్‌గా యాంటీబాడీని మాత్రమే ఇంజెక్షన్‌ రూపంలో ఇవ్వడాన్నే మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స అంటారు. ఇది రెండు రకాలుగా అందుబాటులో ఉంది. అంటే రెండు రకాల యాంటీబాడీ రూపాలను ఒక మందుగా చేసి ఇస్తారు. Casirivimab, Imdivimab అనే రెండు రకాల మోనోక్లోనల్‌ యాంటీబాడీలను కలిపి ఇవ్వడం వల్ల ఒకచోట మిస్ అయినా, ఇంకోచోట మిస్‌ కాకుండా పనిచేస్తాయి. ఇవి నిర్దుష్టంగా వైరస్‌ పైన ఒక్కచోటే టార్గెట్‌ చేసి దాడి చేస్తాయి. అంటే వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ పైనే దాడిచేసి, దాన్ని అతుక్కుని, వైరస్‌ని నిర్వీర్యం చేస్తాయి. అందుకే కొవిడ్‌కి ఈ చికిత్స మంచి ఫలితాలను ఇస్తోంది. ఈ చికిత్సకు 60 నుంచి 70 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది.

ఎలా ఇస్తారు? మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్సను రక్తనాళం ద్వారా ఇస్తారు. అంటే చేతిలోని రక్తనాళం (సిర)లోకి మందును ఇంజెక్ట్‌ చేస్తారన్నమాట. దీన్నే ఇంట్రావీనస్ (ఐవి)గా ఇవ్వడం అంటారు. సబ్‌క్యుటేనియస్‌గా (చర్మం ద్వారా) కూడా ఈ ఇంజెక్షన్‌ను ఇస్తారు. ఒక మోనోక్లోనల్‌ యాంటీబాడీ వయల్‌ని ఇద్దరు పేషెంట్లకు వాడవచ్చు. ఒకరికి వాడిన తర్వాత (అంటే దాన్ని ఓపెన్‌ చేశాక) 36 గంటల సమయంలోగా ఇంకో పేషెంట్‌కి వాడాలి. లేకుంటే వేస్ట్‌ అయిపోతుంది.

తొలుత డొనాల్డ్ ట్రంప్‌ కరోనా చికిత్స..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా వైరస్ బారిన పడినప్పుడు మోనోక్లోనల్‌ యాంటీబాడీలనే ఎక్కించారు. రెండు రోజుల్లోనే ట్రంప్‌ కోలుకున్నారు. వీటిని ఎవరికి పడితే వారికి ఇవ్వద్దని ఆప్పట్లో వైద్య నిపుణులకు ఆంక్షలు విధించారు. తగిన సమయంలో ఇవ్వడం ద్వారా వైరస్‌ లోడ్‌ గణనీయంగా తగ్గిపోతుంది.

ఎప్పుడు ఇవ్వాలంటే…

* వైరస్‌ లక్షణాలు కనిపించిన 3-7 రోజుల్లోపు ఈ ఇంజక్షన్‌ ఇవ్వాలి.

* ఇంజక్షన్ ఇచ్చిన 7-10 రోజుల్లో వైరస్‌ శరీరం నుంచి మటుమాయమవుతుంది.

* వైరస్‌ సోకిన 10 రోజుల తర్వాత ఇస్తే అంత సానుకూల ప్రభావం ఉండదు. ఎందుకంటే అప్పటికే శరీరంలో వైరస్‌ లోడ్‌ బాగా పెరిగిపోయి ఉంటుంది.

* ఇంజక్షన్‌ ఇవ్వాలంటే ముందు తప్పనిసరిగా ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష చేయించాలి.

* అందులో ‘సైకిల్‌ త్రెషోల్డ్‌(సీటీ)’ విలువను ప్రామాణికంగా తీసుకోవాలి.

* ఎన్ని సైకిల్స్‌లో వైరస్‌ను గుర్తించారనేది ముఖ్యం.

* 15 సైకిల్స్‌లో వైరస్‌ను గుర్తిస్తే.. వైరల్‌ లోడ్‌ ఎక్కువగా ఉందని అర్థం.

* అదే 30 సైకిల్స్‌లో వైరస్‌ను నిర్ధారిస్తే.. వారిలో లోడ్‌ తక్కువగా ఉందని తెలుస్తుంది.

* 15 సీటీ వ్యాల్యూ ఉన్నవారికి వారం తర్వాత 30కి తగ్గితే.. అప్పుడు ఆ ఇంజక్షన్‌ బాగా పనిచేసినట్లుగా గుర్తిస్తారు.

ఎవరికి ఇవ్వొద్దంటే…

* ఆసుపత్రిలో చేరి ఆక్సిజన్‌ సాయంతో.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నవారికి ఇంజక్షన్ ఇవ్వకూడదు.

* బహుళ అవయవాలు దెబ్బతిన్నవారికి..

* గర్భిణులకు కూడా ఈ ఇంజక్షన్ ఇవ్వకూడదు.

* మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స తీసుకున్నవాళ్లు మూడు నెలల తరువాత మాత్రమే వాక్సిన్‌ వేయించుకోవాలి. అంతకుముందు వాక్సిన్‌ వేయించొద్దు.

* కోవిడ్ నుంచి కోలుకున్నవాళ్లకు ఈ చికిత్స అవసరం లేదు.

మోనోక్లోనల్‌ చికిత్స ఎలా పనిచేస్తుందిః

మోనోక్లోనల్‌ చికిత్స పొందినవారిలో 70-80 శాతం మంది 3-4 రోజుల్లో కోలుకుంటారు. వారం రోజుల్లో పూర్తిగా నయమవుతుంది. ఈ ఔషధాన్ని పొందినవారి ఆరోగ్యం ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లదు. ఈ యాంటీబాడీలు శరీరంలోకి వెళ్లిన తర్వాత.. కోవిడ్‌ స్పైక్‌ ప్రోటీన్‌కు.. శరీర కణాలకు మధ్య ఇవి అడ్డు గోడగా నిలుస్తాయి. ఫలితంగా వైరస్‌ శరీర అంతర్భాగంలోకి ప్రవేశించలేదు. వైరస్‌ తన సంఖ్యను పెంచుకునే అవకాశం సన్నగిల్లుతుంది’’ అని డా. నాగేశ్వరరెడ్డి తెలిపారు.

ఎవరికి ఎక్కువ మేలు?

* 65 ఏళ్లు దాటిన వారికి..

* స్థూలకాయులకు అంటే ‘బాడీ మాస్‌ ఇండెక్స్‌’ 35 కంటే ఎక్కువగా ఉన్నవారికి..

* దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి పీడితులకు..

* ఎంతోకాలంగా మధుమేహానికి చికిత్స పొందుతున్నవారికి..

* రోగ నిరోధక శక్తిని తగ్గించే ఔషధాలను వినియోగిస్తున్నవారికి.. ఉదాహరణకు క్యాన్సర్‌ రోగులు, అవయవ మార్పిడి చేయించుకున్నవారికి.

* 55 ఏళ్లు దాటి అధిక రక్తపోటు, గుండెజబ్బు ఉన్న బాధితులకు..

* క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌, ఆస్తమాతో బాధపడుతున్నవారికి..

* పై దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ముప్పు తీవ్రత ఉంటే 12 ఏళ్లు దాటిన వారికి..

* పాలిచ్చే తల్లులు ఈ చికిత్స తీసుకోవచ్చు.

సైడ్‌ ఎఫెక్టులున్నాయా?…

మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స వల్ల పెద్దగా దుష్ప్రభావాలేమీ లేవు. అయితే కొందరిలో దురద, వికారంగా ఉండటం, వాంతుల వంటి సమస్యలు రావొచ్చు. కానీ ఇవి కొన్ని రోజులకు తగ్గిపోతాయి.

ఇదిలావుంటే, కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌ మైల్డ్‌ నుంచి మాడరేట్‌ గా ఉనవాళ్లకు ఈ యాంటీబాడీల చికిత్స ఇస్తే సత్ఫలితాలుంటాయని న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రచురితమైంది. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా ఉండి, హాస్పిటల్‌లో చేరి, ఆక్సిజన్‌ పెట్టాల్సిన అవసరం ఉన్నవాళ్లకు ఈ చికిత్స వల్ల ఉపయోగం లేదు. వీళ్లకు వాడవద్దని సూచించారు. విచక్షణారహితంగా, ఇష్టానుసారంగా వీటిని వాడకూడదు. ఇది వ్యాక్సిన్‌ కాదు.

Read Also… Good News: కోవిడ్ పై పోరాటంలో మరింత పురోగతి.. కరోనా రోగులకు సరికొత్త చికిత్స.. పాజిటివ్ స్టోరీలు మీ కోసం

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ