Sleep Techniques: నిద్ర‌లేమితో స‌త‌మ‌త‌మ‌వుతున్నారా.? అయితే ఈ సింపుల్ టెక్నిక్స్‌ను ఫాలో అవ్వండి.. స‌మ‌స్య నుంచి..

Sleep Techniques: నిద్ర‌లేమి... విన‌డానికి చిన్న స‌మ‌స్యే అయినా అనుభ‌వించే వారికి ఇదో న‌ర‌కం. మ‌న‌కు వ‌చ్చే చాలా వ‌రకు అనారోగ్యాల‌కు స‌రిప‌డ నిద్ర లేక‌పోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు...

Sleep Techniques: నిద్ర‌లేమితో స‌త‌మ‌త‌మ‌వుతున్నారా.? అయితే ఈ సింపుల్ టెక్నిక్స్‌ను ఫాలో అవ్వండి.. స‌మ‌స్య నుంచి..
Sleep Techniques
Follow us

|

Updated on: May 27, 2021 | 7:11 PM

Sleep Techniques: నిద్ర‌లేమి… విన‌డానికి చిన్న స‌మ‌స్యే అయినా అనుభ‌వించే వారికి ఇదో న‌ర‌కం. మ‌న‌కు వ‌చ్చే చాలా వ‌రకు అనారోగ్యాల‌కు స‌రిప‌డ నిద్ర లేక‌పోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కంటి నిండ నిద్ర ఉంటే స‌గం రోగాలు ప‌రార‌వుతాయి. ఈ క్ర‌మంలోనే నిద్ర‌లేమితో స‌త‌మ‌త‌మ‌య్యే వారు.. ఆ స‌మ‌స్య నుంచి త‌ప్పించుకోవ‌డానికి నిద్ర మాత్ర‌ల‌కు, మ‌ద్య‌పానానికి అల‌వాటు ప‌డుతుంటారు. ఇవి క‌చ్చితంగా ఆరోగ్యానికి హాని చేసేవే.. మ‌రి స‌హ‌జంగా నిద్ర‌లేమి స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌డానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయ‌నే విష‌యం మీకు తెలుసా.? అవేంటో ఓసారి తెలుసుకుందాం ప‌దండి..

* మీరు నిద్రించే గ‌ది శుభ్రంగా ఉండేలా చూసుకోండి. గ‌దిలో చింద‌ర వంద‌ర‌గా ఉంటే మాన‌సిక ఆరోగ్యంపై ప్ర‌భావం చూపుతుంది. కాబ‌ట్టి వీలైనంత వ‌ర‌కు ప్ర‌శాంతంగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

* ప్ర‌తి రోజూ ఒకే స‌మ‌యానికి ప‌డుకోవ‌డం, ఒకే స‌మ‌యానికి లేవ‌డం అల‌వాటు చేసుకోవాలి. దీని ద్వారా మీ శ‌రీరం దానికి అల‌వాటు ప‌డుతుంది. ఆదివారం హాలీడే క‌దా ఎక్కువ సేపు ప‌డుకుంటామంటే కుద‌రదు వారాంతాల్లో కూడా ఒకే టైమ్ టేబుల్‌ను ప‌క్కాగా పాటించాల్సిందే.

* ఇక ప‌డ‌క గ‌దిలో లైట్ లేకుండా చూసుకోవాలి. ప‌రిశోధ‌కుల అభిప్రాయం ప్ర‌కారం రాత్రి పూట లైట్ ఉంటే నిద్రకు ఉప‌క్ర‌మించేందుకు ఉప‌యోగ‌ప‌డే మెల‌టోనిన్ హార్మోన్ ఉత్ప‌త్తి త‌గ్గుతుంది. ఇది నిద్ర‌లేమి దారి తీస్తుంది. కాబ‌ట్టి ప‌డుకునే గ‌దిలో లైట్‌లు లేకుండా చూసుకోవాలి. చిన్న బెడ్ లైట్ వేసుకుంటే స‌రిపోద్ది.

* ప‌డుకునే ముందు స్మార్ట్ ఫోన్‌ల‌కు దూరంగా ఉండాలి. నిద్ర‌పోయే ముందు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్‌ను వాడ‌కూడ‌దు. స్మార్ట్ ఫోన్ నుంచి వ‌చ్చే బ్లూ లైట్ కార‌ణంగా క‌ళ్ల‌పై ఒత్తిడిపెరుగుతుంది. ఇక మొబైల్ ఫోన్‌ను త‌ల‌కు ద‌గ్గ‌ర పెట్టుకోకూడ‌దు.

* నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ఆరు గంట‌ల ముందు నుంచి కాఫీలకు దూరంగా ఉండాలి. కెఫీన్ ఉండే చాక్లెట్ల‌కు కూడా దూరంగా ఉండాల‌ని నిపుణులు చెబుతున్నారు.

* ఇక ఎలాంటి ఆటంకం లేకుండా హాయిగా నిద్ర‌పోవాలంటే మ‌ద్య‌పానానికి దూరంగా ఉండాల్సిందేన‌ని చెబుతున్నారు నిపుణులు. ఆల్క‌హ‌ల్ తీసుకుంటే నిద్ర వ‌చ్చిన‌ట్లే అనిపించినా.. మ‌ధ్య‌లో నిద్ర‌కు ఆటంకం క‌లుగుతుంది.

* ప‌డుకునే ముందు ఎక్కువ మోతాదులో, స్పైసీ ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల కూడా నిద్ర‌కు భంగం క‌లుగుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి హెవీ ఫుడ్ తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో నిద్ర‌కు దూర‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి. కాబ‌ట్టి రాత్రి వీలైనంత వ‌ర‌కు లైట్ ఫుడ్ తీసుకోవాలి.

Also Read: క్రికెట్‌లో అద్భుత ప్లేయర్.. సచిన్‌ కంటే ముందు.. 1000, క్యాచ్‌‌లు, 58 వేల పరుగులు చేశాడు..

Megastar Chiranjeevi: మరో రీమేక్ కు సిద్దమవుతున్న మెగాస్టార్.. ఈసారి ప్రభాస్ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వనున్న చిరంజీవి..

Post Covid Exercises: కరోనా నుంచి కోలుకున్నారా? ఆరోగ్యం మునుపటిలా ఉండాలంటే ఎలాంటి వ్యాయామాలు చేయాలో తెలుసుకోండి..