AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR : పంజాబ్ వంటి రాష్ట్రాల్లో నూటికి నూరు శాతం ధాన్యం సేకరిస్తున్న ఎఫ్ సీ ఐ.. తెలంగాణలో సేకరించకపోవడంపై సీఎం అసంతృప్తి

పంజాబ్ వంటి రాష్ట్రాల్లో నూటికి నూరు శాతం ధాన్యం సేకరిస్తున్న ఎఫ్ సీ ఐ.. తెలంగాణలో సేకరిచంక పోవడం పై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు..

KCR : పంజాబ్ వంటి రాష్ట్రాల్లో నూటికి నూరు శాతం ధాన్యం సేకరిస్తున్న ఎఫ్ సీ ఐ.. తెలంగాణలో సేకరించకపోవడంపై సీఎం అసంతృప్తి
Modi And KCR
Venkata Narayana
|

Updated on: May 30, 2021 | 12:09 AM

Share

CM KCR dissatisfaction  : ధాన్యం సేకరణలో కేంద్రం వివిధ రాష్ట్రాల మధ్య వివక్ష చూపించడం తగదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పండుతున్న వరి ధాన్యం మొత్తాన్ని కొనాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నామని సీఎం తెలిపారు. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో నూటికి నూరు శాతం ధాన్యం సేకరిస్తున్న ఎఫ్ సీ ఐ.. తెలంగాణలో సేకరించక పోవడం పై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ఇట్లా వివక్ష చూపడం సరికాదన్నారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాయనున్నామన్నారు. తెలంగాణలో ధాన్యం నిల్వ సామర్ధ్యం ఇంకా పెంచుతామని చెప్పిన కేసీఆర్.. ధాన్యాన్ని కొనడం ఎంత శ్రమో.. ధాన్యాన్ని సేకరించి స్టాకు చేయడం కూడా అంతే శ్రమతో కూడుకున్నదని తెలిపారు. తెలంగాణ వచ్చిన కొత్తలో కేవలం 4 లక్షల టన్నుల ధాన్యాన్ని స్టాకు చేయడానికి మాత్రమే గోడౌన్ల లభ్యత వుండేదని, కానీ నేడు 25 లక్షల టన్నుల ధాన్యాన్ని నిల్వచేసుకునేందుకు గోడౌన్ల నిర్మాణం జరిగిందన్నారు. భవిఫ్యత్తులో మొత్తం 40 లక్షల టన్నుల సామర్థ్యనికి గోడౌన్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు మార్కెటింగ్ శాఖ సిద్ధం చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం తద్వారా నీటిపారుదల రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు వ్యవసాయ రంగం అభివృద్ది పథాన దూసుకుపోవడానికి ముఖ్య కారణాలని సీఎం వివరించారు.

మిషన్ కాకతీయద్వారా చెరువులన్నీ పటిష్టంగా మారినయన్నారు. కట్టలు తెగకుండా వచ్చిన నీటి బొట్టును వచ్చినట్టే చెరువులు ఒడిసిపట్టుకున్నాయన్నారు. తద్వారా భూగర్భజలాలు పెరుగుతున్నాయని, ప్రభుత్వం అందించే ఇరవైనాలుగు గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ద్వారా బోరు బావులతో పంటలు పండుతున్నాయన్నారు. కృష్ణా గోదావరి నదుల మీద ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు కట్టుకోవడం, కాళేశ్వరం దేవాదుల వంటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం, తదితర కొత్త ప్రాజెక్టులను మొదలు పెట్టడం వంటి ప్రభుత్వ చర్యల వలన వ్యవసాయ రంగంలో తెలంగాణ ఇంతటి ఘన విజయాన్ని సాధించగలిగిందని సీఎం శనివారం నిర్వహించిన వ్యవసాయరంగ సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు.

Read also : Sunil Deodhar : టీడీపీ అందించించిన స్నేహ హస్తానికి ఘాటుగా రియాక్షన్ ఇచ్చిన ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దేవధర్