Sunil Deodhar : టీడీపీ అందించించిన స్నేహ హస్తానికి ఘాటుగా రియాక్షన్ ఇచ్చిన ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దేవధర్

జగన్-బాబు కుటుంబ రాజకీయాలకు, అవినీతికి ప్రత్యామ్నాయంగా..

Sunil Deodhar : టీడీపీ అందించించిన స్నేహ హస్తానికి ఘాటుగా రియాక్షన్ ఇచ్చిన ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దేవధర్
Sunil Deodhar
Follow us

|

Updated on: May 29, 2021 | 7:16 PM

Sunil Deodhar : 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మళ్లీ బీజేపీతో జతకడుతుందంటూ చంద్రబాబు మళ్ళీ స్టంట్ మొదలు పెట్టారని విమర్శించారు బీజేపీ ఏపీ ఇంచార్జి సునీల్ దేవధర్. బీజేపీ, జనసేన పార్టీలు కలిసి సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాయని ఆయన చెప్పారు. జగన్-బాబు కుటుంబ రాజకీయాలకు, అవినీతికి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయన్నారు. రెండు వరుస ట్వీట్లలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన సునీల్ దేవధర్.. మరో ట్వీట్లో మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఆ తర్వాత 2019లో ప్రధాని మోడీకి వెన్నుపోటు పొడిచారంటూ సునీల్‌ దియోధర్‌ అన్నారు. 2019లో ఆయన అంచనా పూర్తిగా తప్పిందని, వ్యూహాలు విఫలమయ్యాయంటూ వ్యాఖ్యానించారు. 2024లో బీజేపీతో కలిసి పనిచేద్దామంటూ చంద్రబాబు ఇచ్చిన ఆఫర్‌ టీడీపీని బతికించుకునేందుకే అంటూ సునీల్‌ దియోధర్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, నిన్న జరిగిన టీడీపీ మహానాడులో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఇతర ప్రతిపక్ష, భావసారూప్య పార్టీలతో కలసి పోరాడాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. మహానాడులో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిన సంగతి తెలిసిందే.

“రాష్ట్రంలో మనతో కూటమికి ముందుకొచ్చే పార్టీలు వస్తాయి. రాలేని పార్టీలున్నా ప్రభుత్వంపై పోరాటం విషయంలో అందరినీ ఒక తాటిపైకి తేవాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మనపై ఉంది.. ఒకే గొడుగు కిందకు రాలేని పార్టీలు కూడా వారి మార్గంలో ప్రభుత్వంపై పోరాడేలా సమన్వయం చేయాలి” అని తీర్మానించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఇచ్చిన ఆఫర్ కు 24 గంటలు గడవక ముందే సునీల్ దేవధర్ పై విధంగా రియాక్ట్ అయ్యారు. దీంతో బీజేపీతో స్నేహానికి ప్రయత్నాలు చేయొద్దంటూ చంద్రబాబుకు దియోధర్‌ చెప్పినట్లయింది.

Read also : Azam Khan : ఎస్పీ సీనియర్ నేత ఆజంఖాన్ పరిస్థితి విషమం, తండ్రీకొడుకులిద్దరికీ మేదాంతలో ట్రీట్మెంట్