Amazing Viral Video: గాలిలో ఎగురుతూన్న డేగపై చేప దాడి చేసింది… ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు…
ఆహారం కోసం వేటాడేందుకు నిశబ్ధంగా ఎగురుతూ వెళ్తున్న డేగ.. తనపై జరుగనున్న దాడి ఊహించలేక పోయింది. నీటి నుంచి వచ్చిన ఓ పెద్ద చేప దాడి చేసింది.
విధి ఎప్పుడు, ఎలా రివర్స్ అవుతుందో ఎవరూ చెప్పలేరు..! దీనికి చాలా ఉదాహరణలు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. అలాంటి ఒక వీడియో ఇటీవలి కాలంలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.., జీవితంలో కొన్నిసార్లు దుఖం ఉంటుంది.. మరికొన్నిసార్లు ఆనందం ఉంటుంది అనే సామెతను మీరు ఎప్పుడైనా విన్నారా… ఈ సామెత మానవులపై మాత్రమే కాదు, ప్రకృతిలోని ప్రతి జీవిపై కూడా కనిపిస్తుంది. ఈ సామెతకు సరిగ్గా సరిపోయే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈగల్స్ గాలిలో చాలా బలవంతంమైనవని మనందరికీ తెలుసు. ఇది టార్గెట్ చేసిందంటే అంతే.. కళ్లు మూసి తెలిచేంతలో పని కానిచ్చేస్తుంది. చాలా వేగంగా ఎగురగలదు.. దీని వేగం గంటకు 322 కి.మీ. ఉంటుంది.
ఎంతో ప్రశాంతంగా కనిపించే సముద్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతుందని ఎవరూ ఊహించరు… ఓ క్షణం ముందు డేగ కూడా ఊహించ లేదు. ఆహారం కోసం వేటాడేందుకు నిశబ్ధంగా ఎగురుతూ వెళ్తున్న డేగ.. తనపై జరుగనున్న దాడి ఊహించలేక పోయింది. నీటి నుంచి వచ్చిన ఓ పెద్ద చేప దాడి చేసింది.
డేగ ఏదో జరుగుతోంది అని అర్థం చేసుకునేంతలో చేప దానిని పట్టుకుని సముద్రపు లోతుల్లోకి తీసుకెళ్లిపోయింది. తనను తాను రక్షించుకోగలనని ఎంతో అత్మవిశ్వాసంతో ఉండే ఈగల్ చివరికి ఓ చేప నోటికి చిక్కింది. ఈ ఆశ్చర్యకరమైన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నందా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు.
Waqt ko badalne me waqt nahi lagta… Predator becoming prey in no time. pic.twitter.com/N0HKbcKsST
— Susanta Nanda IFS (@susantananda3) May 27, 2021
Read Also: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. పీఎం కిసాన్ పథకంలో చేరేందుకు చివరి తేదీ ఎప్పుడంటే..!