చిత్తూరు ప్రియురాలు హత్య కేసులో వెలుగు చూసిన సంచలన నిజాలు.. పోలీసుల అదుపులో బాలిక, తల్లిదండ్రులు

చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన యువకుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన కూతురిని ప్రేమించాడన్న కోపంతో ధనశేఖర్ అనే యువకుడిని బాబు..

చిత్తూరు ప్రియురాలు హత్య కేసులో వెలుగు చూసిన సంచలన నిజాలు.. పోలీసుల అదుపులో బాలిక, తల్లిదండ్రులు
Plamaneru Murder
Follow us
Subhash Goud

|

Updated on: May 29, 2021 | 12:35 PM

చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన యువకుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన కూతురిని ప్రేమించాడన్న కోపంతో ధనశేఖర్ అనే యువకుడిని బాబు అనే వ్యక్తి కిరాతకంగా చంపేసిన ముక్కలుగా నరికేసి తన పొలంలో పాతిపెట్టాడు. నాలుగు రోజుల తర్వాత బయటపడ్డ ఈ దారుణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ హత్య కేసులో నిందితులను బాలిక తండ్రి, తల్లి సుజాతలను మీడియా ముందు హాజరు పర్చారు  పోలీసులు. అయితే హత్య జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్న బాలికపైనా హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు. అయితే తన కూతురు గదిలో అతన్ని చూసి తట్టుకోలేక హత్య చేశానని బాలిక తండ్రి పోలీసుల ముందు అంగీకరించాడు. అయితే కూతురు మైనర్‌ కావడంతో జువైనల్‌ హోమ్‌కు తరలించారు. అయితే పొలంలో పాతిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా కనిపించకుండాపోయిన కొడుకు ఇక లేడని తెలుసుకున్న ధనశేఖర్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ గంగయ్య కథనం ప్రకారం.. పలమనేరు మండలం పెంగరగుంట గ్రామానికి చెందిన ధనశేఖర్(23)బెంగళూరులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పక్కింట్లో ఉండే బాలిక(16)ను కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేకపోవడంతో శేఖర్ వారం రోజుల కిందట గ్రామానికి వచ్చేశాడు. ఈ నెల 22న తను ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు బాలిక తన తండ్రి ఫోన్‌ ద్వారా అతడికి మెసేజ్ చేసింది. దీంతో ఆమె ఇంటికి వెళ్లి ఏకాంతంగా ఉన్న సమయంలో బాలిక తండ్రి బాబు ఇంటికి వచ్చాడు. తన కూతురితో గదిలో ఉన్న ధనశేఖర్‌ను చూసి రగిలిపోయిన బాలిక తండ్రి.. నీతో మాట్లాడాలి అంటూ ధనశేఖర్‌ను వ్యవవసాయ పొలం వద్దకు తీసుకెళ్లాడు. పొలం వద్దకు చేరుకోగానే కత్తితో ధనశేఖర్‌ను దారుణంగా నరికి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేశాడు. మూడు రోజుల తర్వాత శవం ఉబ్బిపోవడంతో హత్య విషయం బయటకు తెలిసిపోతుందనే ఉద్దేశంతో మృతదేహాన్ని బయటకు తీసి శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తన పొలంలో పూడ్చి పెట్టాడు. కొడుకు కనిపించకపోవడంతో ధనశేఖర్ తండ్రి ఈనెల 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలిక తండ్రే తమ కుమారున్ని  హత్య చేసి ఉంటాడని కుటుంబ తల్లిదండ్రులు ఆరోపిస్తూ గురువారం సాయంత్రం రోడ్డుపై ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు ధనశేఖర్‌ కాల్‌డేటా ఆధారంగా బాలిక తండ్రే హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు బాలిక తండ్రి బాబును అదపులోకి తీసుకుని విచారించగా, అసలు నిజం చెప్పేశాడు. ఈ కేసుకు సంబంధించి బాబుతో పాటు ఆయన భార్య, కుమార్తెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది

ఇవీ కూడా చదవండి:

Doctor Couple Dead: దారుణం.. డాక్ట‌ర్ దంప‌తుల్ని కాల్చి చంపిన దుండగులు.. కారు ఆపి మరి దుశ్చర్య

Brazil Covid Hospital: బ్రెజిల్ కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. మృత్యువాతపడ్డ నలుగురు కరోనా బాధితులు