Doctor Couple Dead: దారుణం.. డాక్ట‌ర్ దంప‌తుల్ని కాల్చి చంపిన దుండగులు.. కారు ఆపి మరి దుశ్చర్య

Doctor Couple Dead In Rajasthan: రాజ‌స్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. కారులో వెళ్తున్న డాక్ట‌ర్ దంప‌తుల‌పై ఇద్ద‌రు కాల్పులు తెగబడ్డారు. ఈ ఘ‌ట‌న‌లో డాక్ట‌ర్‌తో పాటు ఆయ‌న భార్య ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అందరూ చూస్తుండగానే దుండగులు నడిరోడ్డుపై డాక్టర్

Doctor Couple Dead: దారుణం.. డాక్ట‌ర్ దంప‌తుల్ని కాల్చి చంపిన దుండగులు.. కారు ఆపి మరి దుశ్చర్య
Doctor Couple Dead In Rajasthan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 29, 2021 | 11:09 AM

Doctor Couple Dead In Rajasthan: రాజ‌స్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. కారులో వెళ్తున్న డాక్ట‌ర్ దంప‌తుల‌పై ఇద్ద‌రు కాల్పులు తెగబడ్డారు. ఈ ఘ‌ట‌న‌లో డాక్ట‌ర్‌తో పాటు ఆయ‌న భార్య ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అందరూ చూస్తుండగానే దుండగులు నడిరోడ్డుపై డాక్టర్ దంపతులను కాల్చి చంపారు. రాజస్థాన్‌లోని భ‌ర‌త్‌పూర్‌ బిజీ క్రాసింగ్ వ‌ద్ద జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. శుక్రవారం సాయంత్రం 4.45 నిమిషాల‌కు ఈ సంఘ‌ట‌న చోటుచేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. బిజీ క్రాసింగ్ వ‌ద్ద బైక్‌పై వ‌చ్చిన ఇద్ద‌రు వ్య‌క్తులు.. కారుకు అడ్డంగా నిలబడి ఆపారు. అయితే డ్రైవ‌ర్ సీటులో ఉన్న డాక్ట‌ర్‌.. కారు విండో తీస్తుండ‌గానే.. బైక్‌పై వ‌చ్చిన ఓ వ్య‌క్తి త‌న చేతిలో ఉన్న తుపాకీతో కాల్పులు జ‌రిపాడు. ప‌లు రౌండ్లు కాల్పులు జ‌రిపి.. డాక్టర్ సందీప్ గుప్తా, ఆయన భార్య సీమా గుప్తా మరణించిన అనంతరం బైక్‌పై ప‌రారీ అయ్యారు. ఈ సంఘటన అంతా అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది.

ప్ర‌తీకారంతోనే డాక్ట‌ర్ దంపతుల‌ను హ‌త్య చేసి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ యువ‌తి హ‌త్య కేసులో డాక్ట‌ర్ దంప‌తులు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. 2019లో వీరిద్దరూ అరెస్ట్ అయి బెయిల్‌పై విడుదలయ్యారు. చనిపోయిన యువతి డాక్ట‌ర్‌తో రిలేష‌న్‌పిప్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. డాక్ట‌ర్‌పై కాల్పులు జ‌రిపిన వ్య‌క్తి ఆ యువ‌తి సోద‌రుడిలా ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. రెండేళ్ల క్రితం ఆ యువ‌తి హ‌త్య‌కు గురైంది. ఈ కేసులో డాక్ట‌ర్ సందీప్, అతని భార్య‌తో పాటు ఆమె త‌ల్లి కూడా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.