Marriage Ceremony: పెళ్లి మండపంపై తెగిపడిన విద్యుత్ తీగలు.. నలుగురు మృతి.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు..

Short Circuit in Pandal: అంగరంగవైభవంగా వివాహ మహోత్సవం జరిగింది. అంతలోనే ఆ పెళ్లింట విషాదం నెలకొంది. విద్యుత్ తీగల రూపంలో మృత్యువు కబళించింది. మండపంలో విద్యుదాఘాతంతో

Marriage Ceremony: పెళ్లి మండపంపై తెగిపడిన విద్యుత్ తీగలు.. నలుగురు మృతి.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు..
Up Police In Hospital
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 29, 2021 | 7:56 AM

Short Circuit in Pandal: అంగరంగవైభవంగా వివాహ మహోత్సవం జరిగింది. అంతలోనే ఆ పెళ్లింట విషాదం నెలకొంది. విద్యుత్ తీగల రూపంలో మృత్యువు కబళించింది. మండపంలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని సీతాపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. సీతాపూర్ జిల్లాలోని కమలాపూర్‌ ప్రాంతంలోని ఓ గ్రామంలో శుక్రవారం రాత్రి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ క్రమంలో బలంగా వీచిన ఈదురుగాలుల ధాటికి విద్యుత్‌ తీగలు తెగిపడి పెళ్లి మండపంపై పడ్డాయి. దీంతో మండపం అంతటా షాక్ వచ్చింది. ఈ షార్ట్‌ సర్క్యూట్‌తో వల్ల నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని వరుడు వెల్లడించాడు.

వారిని వెంటనే అంబులెన్స్‌లో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. కాగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లింట నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. శుభకార్యం ముగియకముందే.. ఈ విషాద సంఘటన జరిగిందంటూ బంధువుల కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read:

Ongole: ఒంగోలులో దారుణం.. ఎస్ఐ పిలుస్తున్నారంటూ తీసుకెళ్లి అత్యాచారం.. ఆ తర్వాత..

Woman Constable Raped: కామంతో కళ్లు మూసుకుపోయిన పోలీస్.. యాస్ విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌పై లైంగికదాడి

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ