Beauty Tips: ఉప్పుతో చర్మ సమస్యలకు చెక్.. ఇలా ఉపయోగిస్తే ఫలితం పక్కా.. ఎలా వాడాలంటే…
ఎండాకాలంలో చాలా మంది చర్మ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ఈ సీజన్ లో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా ముఖంపై
ఎండాకాలంలో చాలా మంది చర్మ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ఈ సీజన్ లో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా ముఖంపై మొటిమలు, పింపుల్స్ వస్తుంటాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే.. వేసవిలో శరీరం ఎప్పుడూ హైడ్రేట్ గా ఉండేలా చూసుకోవాలి. ఈ సమస్యలను నియంత్రించేందుకు మీ ఇంట్లో ఉండే పదార్థాలను ఎంతో ఉపయోగపడతాయి. అందులో ఒకటి ఉప్పు. దీంతో చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు అనే విషయం మీకు తెలుసా.. ఈ ఉప్పును కొన్ని విధాలుగా ఉపయోగిస్తే.. చర్మ సమస్యలను నియంత్రించవచ్చు. మరీ అది ఎలాగో తెలుసుకుందామా.
టోనర్ గా పనిచేస్తుంది.. వేసవిలో చర్మంపై ఉన్న జిడ్డును తొలగించుకోవడానికి ఉప్పు ఎక్కువగా పనిచేస్తుంది. అలాగే చర్మంపై పేరుకుపోయిన అదనపు నూనెను తగ్గించడంలో ఉప్పు ఎక్కువగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఉప్పు టోనర్ గా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పును స్ప్రే బాటిల్ లో కలపాలి. ఇందులో దూదిని ముంచి ముఖంపై పూయాలి.
1. పొడి చర్మం ఉన్నవారు స్నానం చేసే నీటిలో ఉప్పును కలపాలి. ఇలా చేయడం వలన అలసట తగ్గిస్తుంది. 2. స్క్రీన్ టానింగ్ సమస్యలు ఉన్నవారు సముద్రపు ఉప్పు, రాక్ ఉప్పును వాడాలి. ఇందుకోసం ఒక టీస్పూన్ నారియస్ ఆయిల్, ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని శరీరంపై రుద్ది 10 నుంచి 15 నిమిషాలు వదిలెయ్యాలి. ఇలా చేస్తే చెమట వాసన తగ్గుతుంది. 3. మూడు టీ స్పూన్స్ తేనె, టీస్పూన్ ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి.. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేస్తే చర్మంపై ఉండే రంధ్రాలను క్లీన్ చేస్తుంది.
Coronavirus: కోవిడ్ సోకిన వారు నిరంతరం ఆ రెండు జాగ్రత్తలు పాటిస్తే చాలు మరణం నుంచి రక్షణ పొందవచ్చు..