Telangana Lockdown : తెలంగాణలో లాక్ డౌన్ నేపథ్యంలో కేబినెట్ భేటీ మీదే అందరి దృష్టి, ఎలాంటి నిర్ణయం వస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ

ఇవాళ్టి కేబినెట్ భేటీలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా? లేదంటే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, ఉదయం పదిగంటల వరకే షాపులు తెరవడంతో విపరీతమైన రద్దీ ఏర్పడుతోన్న నేపథ్యంలో సడలింపులు ఇస్తారా? అనే చర్చ అందరిలోనూ జరుగుతోంది.

Telangana Lockdown : తెలంగాణలో లాక్ డౌన్ నేపథ్యంలో కేబినెట్ భేటీ మీదే అందరి దృష్టి, ఎలాంటి నిర్ణయం వస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ
Lock Down Hyderabad
Follow us

|

Updated on: May 30, 2021 | 2:52 PM

Telangna lockdown : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ కాసేప‌ట్లో భేటీ కాబోతోంది. రేపటితో తెలంగాణలో లాక్‌డౌన్ గడువు ముగుస్తోన్న నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగింపుపై నిర్ణ‌యం తీసుకోనున్న నేపథ్యంలో ఈ భేటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మంత్రివర్గ సమావేశంలో లాక్ డౌన్ పొడిగింపుకు సంబంధించిన నిర్ణయంతో పాటు, ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో వైద్య‌సేవ‌లు, అందుబాటులో ఉన్న బెడ్ల‌పైనా ప్రధానంగా చ‌ర్చ‌ జరుగనుంది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మహమ్మారి కట్టడిలో భాగంగా మే 12 నుంచి తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని వర్తక, వ్యాపారాలు, కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటికి అనుమతి ఇవ్వడంలేదు. రోజులో 20 గంటలు లాక్‌డౌన్ విధిస్తున్నారు. రెండో దఫా లాక్ డౌన్ పొడింగించినప్పటి నుంచి రాజధాని హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. దీంతో అనేక చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ్టి కేబినెట్ భేటీలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా? లేదంటే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, ఉదయం పదిగంటల వరకే షాపులు తెరవడంతో విపరీతమైన రద్దీ ఏర్పడుతోన్న నేపథ్యంలో సడలింపులు ఇస్తారా? అనే చర్చ అందరిలోనూ జరుగుతోంది.

కాగా, మరోవైపు టీఆర్ఎస్ పార్టీ మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్ధీన్ ఒవైసీ లాక్ డౌన్ కి సంబంధించి ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి లాక్ డౌన్ పరిష్కారమార్గం కాదని.. పేద ప్రజలు లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసద్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Read also : Sunil Deodhar : టీడీపీ అందించించిన స్నేహ హస్తానికి ఘాటుగా రియాక్షన్ ఇచ్చిన ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దేవధర్