IIT HYD: ఐఐటీ హైద‌రాబాద్‌లో ఉద్యోగాలు.. ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక.. ద‌ర‌ఖాస్తుల‌కు రేపే చివ‌రి తేదీ..

IIT Hyderabad Recruitment 2021: హైద‌రాబాద్‌లో ఐఐటీ ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. సంగారెడ్డి స‌మీపంలో ఉన్న ఈ క్యాంప‌స్‌లో రీసెర్చ్ అసోసియేట్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు...

IIT HYD: ఐఐటీ హైద‌రాబాద్‌లో ఉద్యోగాలు.. ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక.. ద‌ర‌ఖాస్తుల‌కు రేపే చివ‌రి తేదీ..
Iit Hyderabad
Follow us
Narender Vaitla

|

Updated on: May 30, 2021 | 2:20 PM

IIT Hyderabad Recruitment 2021: హైద‌రాబాద్‌లో ఐఐటీ ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. సంగారెడ్డి స‌మీపంలో ఉన్న ఈ క్యాంప‌స్‌లో రీసెర్చ్ అసోసియేట్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల చివ‌రి తేదీ రేప‌టితో (మే 31) ముగియ‌నున్న నేప‌థ్యంలో రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్నఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎయిరోస్పేస్‌ ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 03 ఖాళీల‌ను భ‌ర్తీచేయ‌నున్నారు.

* పోస్టుల‌ను అనుస‌రించి.. మెకానికల్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో ఎంఈ/ఎంటెక్‌/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. దీంతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌సు 27–33 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌/మహిళలకు ఏడాది, ఎస్సీ/ఎస్టీలకు రెండేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు త‌మ పూర్తి వివ‌రాల‌ను ashok@mae.iith.ac.in మెయిల్ ఐడీకి పంపించాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల‌కు రేపే (మే 31) చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు https://www.iith.ac.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

Also Read: ‘మెడికల్ మాఫియా’ పై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మీద కేసు పెడతారా ..?? బాబా రాందేవ్ బాబా సవాల్

CM Jagan: అంద‌రికీ మంచి చేశాన‌న్న న‌మ్మ‌కం ఉంది.. రెండేళ్ల పాల‌నపై సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్యాఖ్య‌..

ప్రధాని మోదీ ఓ ‘ఈవెంట్ మేనేజర్’…, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్, … ‘మన్ కీ బాత్’ అర్థ రహితమని విమర్శ