AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE Exams: సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై కొన‌సాగుతోన్న సందిగ్ధ‌త‌… జూన్ 3న నిర్ణ‌యం తెల‌ప‌నున్న కేంద్రం..

CBSE Exams: సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై సందిగ్ధ‌త కొన‌సాగుతూనే ఉంది. దేశంలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోన్న వేళ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ పిటిష‌న్‌ను సుప్రీం కోర్టు సోమ‌వారం విచారించింది. ప‌రీక్ష‌ల...

CBSE Exams: సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై కొన‌సాగుతోన్న సందిగ్ధ‌త‌... జూన్ 3న నిర్ణ‌యం తెల‌ప‌నున్న కేంద్రం..
Cbse Exams
Narender Vaitla
|

Updated on: May 31, 2021 | 1:07 PM

Share

CBSE Exams: సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై సందిగ్ధ‌త కొన‌సాగుతూనే ఉంది. దేశంలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోన్న వేళ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ పిటిష‌న్‌ను సుప్రీం కోర్టు సోమ‌వారం విచారించింది. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన నిర్ణ‌యంపై విచారణ ప్రారంభమైన కాసేప‌టికే కోర్టు వాయిదా ప‌డింది. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణపై కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవాల‌ని అటార్నీ జనరల్‌కు సుప్రీం కోర్టు తెలిపింది. దీనిపై స్పందించిన అటార్నీ జ‌న‌ల్ వేణుగోపాల్ ప్ర‌భుత్వం రెండు రోజుల్లో నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని తెలిపారు. ఇందులో భాగంగా విచార‌ణ‌ను గురువారంకు వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. జూన్ 3న ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణపై ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేయ‌నుంది.

ఇదిలా ఉంటే దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైన విష‌యం తెలిసిందే. గ‌త శుక్ర‌వారం విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు విచార‌ణ‌ను నేటికి (సోమ‌వారం) వాయిదా వేసింది. పిటిష‌న్‌లో భాగంగా.. పరీక్షలను రద్దు చేసేలా సీబీఎస్ఈ, సీఐఎస్‌సీఈ బోర్డులకు ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయవాది మమతాశర్మ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పరీక్షలను రద్దు చేసి, నిర్ణీత కాలపరిమితితో ఫలితాలను ప్రకటించడానికి ఆబ్జెక్టివ్‌ పద్ధతిని రూపొందించేలా కేంద్రం, సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ బోర్డులకు ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ కోర్టును కోరారు. అయితే ప్ర‌భుత్వం మాత్రం ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌క‌పోతే విద్యార్థులపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని, నిర్వ‌హించితీరుతామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే. ఈ క్ర‌మంలోనే ప‌లు రాష్ట్రాలకు చెందిన విద్యాశాఖ మంత్రులు సైతం ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై సానుకూలంగా స్పందించారు. మ‌రి ఈ ఏడాది ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారా.? ర‌ద్దు చేస్తారా.? తెలియాలంటే మ‌రో రెండు రోజులు వేచి చూడాల్సిందే.

Also Read: Fingernails: చేతిగోళ్లపై అర్ధచంద్రాకారం.. గోళ్లను చూసి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవచ్చు.. ఎలాగంటే..!

Eat Bananas : అరటితో ఆయుష్షు పెంచుకోండి..! అల్పాహారంతో పాటు తినండి.. అద్భుత ప్రయోజనాలు పొందండి..

Nirmal District : నిర్మల్ జిల్లాలో బయటపడిన పురాతన విగ్రహాలు..! బుద్ధుడు, అమ్మదేవతలుగా గుర్తించిన చరిత్ర కారులు..