Nirmal District : నిర్మల్ జిల్లాలో బయటపడిన పురాతన విగ్రహాలు..! బుద్ధుడు, అమ్మదేవతలుగా గుర్తించిన చరిత్ర కారులు..

Nirmal District : తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో కాకతీయుల కాలంనాటి పురాతన విగ్రహాలు బయటపడ్డాయి.

Nirmal District : నిర్మల్ జిల్లాలో బయటపడిన పురాతన విగ్రహాలు..! బుద్ధుడు, అమ్మదేవతలుగా గుర్తించిన చరిత్ర కారులు..
Buddha And Goddess
Follow us
uppula Raju

|

Updated on: May 31, 2021 | 12:21 PM

Nirmal District : తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో కాకతీయుల కాలంనాటి పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. ముస్లిం రాజుల దండయాత్రలో ఆ కాలంలో ఎన్నో అరుదైన విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. కొన్నింటిని మాత్రం పౌరులు పొలాల్లో, గుట్టల్లో దాచారు. చాలా విలువైన విగ్రహాలు అప్పుడప్పుడు తవ్వకాల్లో బయటపడుతున్నాయి. తాజాగా నిర్మల్‌ జిల్లా బాసరకు అతి చేరువలో ఉన్న మైలా పూర్‌లో కొన్ని రాతి విగ్రహాలు వెలుగు చూశాయి. తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు బలగం రామ్మోహన్‌కు చెందిన పొలం లోని బావి పక్కన ముళ్ల పొదలను తొలగిస్తుండగా పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. వాటిని అరుదైన భంగిమలో ఉన్న బుద్ధుడి విగ్రహం, రెండు అమ్మదేవతల విగ్రహాలు, ఓ అయ్యదేవర శిల్పంగా గుర్తించారు.

అయితే ఈ విగ్రహాలను 11వ శతాబ్దం మొదలు 16వ శతాబ్దానికి చెందినవిగా చరిత్ర కారులు భావిస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో శివలింగం కూడా వెలుగుచూసింది. దీనికి అక్కడి ప్రజలు ఆలయం నిర్మించి పూజలు చేస్తున్నారు. చదువుల తల్లి సరస్వతి క్షేత్రమే బాసర అయినందున ‘విద్యాశరణ సంపన్నుడై’న బుద్ధుడి విగ్రహాన్ని అప్పట్లో స్థానికంగా ఏర్పాటు చేసుకుని ఆరాధించి ఉంటారని చరిత్ర పరిశోధకుడు శివనాగిరెడ్డి అభిప్రాయపడ్డారని చెప్పారు. అయ్యదేవర విగ్రహం మైలారదేవుడిదని, విశ్వకర్మ వర్గానికి చెందినవారు కొలిచే మమ్మాయి దేవత ప్రతిరూపాలు కూడా రెండున్నాయన్నారు.

అప్పట్లో ముస్లిం పాలకుల సైన్యంతోపాటు రోహిల్లా తెగకు చెందినవారు కూడా ఈ ప్రాంతాలపై దాడులు చేసేవారు. స్థానికుడైన మక్కాజీ పటేల్‌ ప్రజలతోపాటు శిల్ప సంపదను కూడా దాచి కాపాడాడని స్థానికుల కథనం. ఈ విగ్రహాలు కూడా ఆయన దాచినవే అయి ఉంటాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ పేర్కొన్నారు. అయితే ఈ విగ్రహాలను చూసిన స్థానికులు రకరకాలుగా చెబుతున్నారు. రెండు దేవతా విగ్రహాలను మమ్మాయి దేవతలుగా అభిప్రాయపడుతున్నారు.

West Bengal : ముదురుతున్న పశ్చిమ్ బెంగాల్ చీఫ్ సెక్రటరీ వివాదం.. రిలీవ్ చేయలేమని మోదీకి లేఖ రాసిన మమతా బెనర్జీ

Ap Telangana Borders: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద భారీగా వాహనాల రద్దీ.. పోలీసుల‌కు కొత్త త‌లనొప్పి

Private Hospital Corona: రూ. రెండు ల‌క్ష‌లు క‌డితేనే మృతదేహం ఇస్తాం.. ఎల్బీన‌గ‌ర్ మ్యాక్స్ క్యూర్‌లో ఘ‌ట‌న‌..